MOTOROLA Edge 60 Pro sale started from today
MOTOROLA Edge 60 Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో మోటోరోలా అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ చిప్ సెట్, పవర్ ఫుల్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ రూ. 29,999 ధరతో మరియు 12GB + 256GB వేరియంట్ రూ. 33,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి Flipakrt మరియు మోటోరోలా అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ 5% బ్యాంక్ ఆఫర్ కూడా అందించింది.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Super HD+ 1.5K స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 4500 వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 12GB LPDDR5X మరియు 256GB (UFS 4.0) స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP (Sony LYTIA 700C) ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 10MP టెలిఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఏ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ మరియు 4K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Amazon Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 16 వేలకే లభిస్తున్న Lava డ్యూయల్ స్క్రీన్ ఫోన్.!
ఈ ఫోన్ 90W TurboPower ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ moto ai సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉండటమే కాకుండా MIL-STD 810H సర్టిఫికేషన్ తో చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుందట.