Motorola Edge 50 Fusion got massive discount
Motorola Edge 50 Fusion స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపు అందుకుంది. భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ తగ్గింపు తో చాలా తక్కువ ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు Sony బిగ్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 5,500 రూపాయల భారీ తగ్గింపు అందుకుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 22,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 4,000 రూపాయల భారీ తగ్గింపు తో రూ. 18,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.
ఈ మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు రూ. 1,500 రూపాయల IDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోన్ ను IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపు ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 17,499 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు.
Also Read: LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వస్తుంది మరియు 6.7 ఇంచ్ ఎండ్ లెస్ ఎడ్జ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 144Hz రిఫ్రెష్ రేట్, 1600 పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 50MP (Sony Lytia 700C) ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో 4K UHD వీడియో రికార్డ్, 8X జూమ్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 14OS తో వస్తుంది మరియు 3 సంవత్సరాల OS అప్డేట్స్ అందుకుంటుంది.
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా కలిగి ఉంటుంది.