108MP కెమెరా బడ్జెట్ 5G ఫోన్ Motorola Edge 20 Fusion ఫస్ట్ సేల్

Updated on 26-Aug-2021
HIGHLIGHTS

Motorola Edge 20 Fusion ఫస్ట్ సేల్

మోటోరోలా ఇటీవల విడుదల చేసిన Motorola Edge 20 Fusion ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 108 క్వాడ్ ఫిక్షన్ కెమెరా సిస్టం, 5G ప్రొసెసర్ మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చింది. ఈ మోటో స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. Flipkart నుండి రేపు జరగనున్న ఈ ఫస్ట్ సేల్ నుండి మంచి ఆఫర్లను కూడా అందించింది.

Motorola Edge 20 Fusion: ప్రైస్

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్ 6జిబి మరియు 128జిబి స్టోరేజ్ తో రూ.21,499 రూపాయల ప్రారంభధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ యొక్క 8GB వేరియంట్ రూ.22,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో వుంది.

Motorola Edge 20: స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్  6.7 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 800U ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ సైబర్ టీఎల్ మరియు ఎలక్ట్రిక్ గ్రాఫైట్ అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

ఎడ్జ్ 20 ఫ్యూజన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. కానీ, ఇది క్వాడ్ కెమేరా పనులను చెయ్యగల శక్తితో వుంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో రెండిటికి సపోర్ట్ చేసే 8ఎంపి సెన్సార్ మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 8X వరకూ డిజిటల్ జూమ్ చెయ్యవచ్చని కంపెని తెలిపింది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ లో 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు టైప్ C ఛార్జర్ తో వస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :