మోటో వన్ విజన్ vs శామ్సంగ్ గెలాక్సీ M40 : కంపారిజన్

మోటో వన్ విజన్ vs శామ్సంగ్ గెలాక్సీ M40 : కంపారిజన్
HIGHLIGHTS

మోటరోలా వన్ విజన్ ఫోన్ను శామ్‌సంగ్ గెలాక్సీ M 40 యొక్క స్పెక్స్ తో పోల్చి చూద్దాం.

ఏ ఫోన్ మంచి స్పెక్స్‌ను అందిస్తుందో తెలుసుకోవచ్చు.

మోటరోలా చివరకు తన మోటరోలా వన్ విజన్ స్మార్ట్‌ఫోన్ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, శామ్‌సంగ్ గెలాక్సీ M 40 స్మార్ట్‌ఫోనులో మనం చూసినటువంటి పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌తో కనబడుతుంది. ఈ రెండు ఫోన్‌లు దాదాపు ఒకే ధరతో ప్రారంభించబడ్డాయి, కాబట్టి మోటరోలా వన్ విజన్ ఫోన్ను  శామ్‌సంగ్ గెలాక్సీ M 40 యొక్క స్పెక్స్ తో పోల్చి చూద్దాం. తద్వారా,  ఏ ఫోన్ మంచి స్పెక్స్‌ను అందిస్తుందో తెలుసుకోవచ్చు.

మోటరోలా వన్ విజన్ Vs శామ్సంగ్ గెలాక్సీ M40 ధర

మోటరోలా వన్ విజన్ ఇప్పటికే బ్రెజిల్, సౌదీ అరేబియా మరియు థాయ్‌లాండ్‌లో అమ్మకాలను  కొనసాగిస్తోంది. అయితే దీన్ని భారతదేశంలో రూ .19,999 ధరతో విడుదల చేసింది  మరియు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ కానుంది. ఇక గెలాక్సీ M 40 గురించి మాట్లాడితే, ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుండి అమ్మకాలను కొనసాగిస్తోంది మరియు ఈ ఫోన్ను రూ .19,990 ధర అందించింది.

మోటరోలా వన్ విజన్ Vs శామ్సంగ్ గెలాక్సీ M40 డిస్ప్లే

ఇక ఈ డిస్ప్లేల  గురించి చూస్తే, మోటరోలా వన్ విజన్ లో మీకు 21: 9 సినిమావిజన్ ఆస్పెక్ట్ రేషియాతో ఒక 6.3-అంగుళాల పూర్తి-హెచ్డి + (1080×2520 పిక్సెల్స్) డిస్ప్లే లభిస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ M 40 లో, మీకు 2340 × 1080 పిక్సెల్‌లతో 6.3-అంగుళాల పూర్తి-హెచ్‌డి + టిఎఫ్‌టి ఎల్‌సిడి ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే రిజల్యూషన్ లభిస్తుంది.

మోటరోలా వన్ విజన్ Vs శామ్సంగ్ గెలాక్సీ M40 కెమెరా

మోటరోలా వన్ విజన్ యొక్క ప్రధాన వెనుక కెమెరా 48 మెగాపిక్సెల్స్ f / 1.7 ఎపర్చరుతో మరియు జతగా 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా  f / 2.2 ఎపర్చరు తో వస్తుంది. ముందు  ఈ ఫోన్ 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ M 40 లో, మీకు 32 మెగాపిక్సెల్ + 5 మెగాపిక్సెల్ +8 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లభిస్తోంది మరియు ఈ ఫోన్ సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

మోటరోలా వన్ విజన్ Vs శామ్సంగ్ గెలాక్సీ M40 ప్రాసెసర్

మోటరోలా వన్ విజన్ శామ్సంగ్ ఎక్సినోస్ 9609 SoC తో 2.2GHz  ఆక్టా-కోర్ 4GB RAM తో వస్తుంది, మరియు 128GB స్టోరేజిని కలిగి ఉంటుంది. మీరు శామ్‌సంగ్ గెలాక్సీ M 40 ను పరిశీలిస్తే, ఈ ఫోన్ 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌ను ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoC తో అందిస్తుంది.

మోటరోలా వన్ విజన్ Vs శామ్సంగ్ గెలాక్సీ M40 బ్యాటరీ

మోటరోలా వన్ విజన్ మరియు శామ్‌సంగ్ గెలాక్సీ M40 రెండు ఫోన్లలో కూడా 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది మరియు రెండూ ఫోన్లు టైప్-సి పోర్ట్‌తో వస్తాయి. అయితే మోటరోలా యొక్క వన్ విజన్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా అందుకుంటాము. ఈ రెండు ఫోన్ల వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ ఇవ్వబడింది.

మోటరోలా వన్ విజన్ Vs శామ్సంగ్ గెలాక్సీ M40 OS

రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 9 పై ఆధారపడి ఉంటాయి కాని మోటరోలా వన్ విజన్ స్టాక్ (ఆండ్రాయిడ్ వన్) తో అందిస్తుంది. అయితే, గెలాక్సీ M 40 స్మార్ట్‌ఫోన్ వన్ UI లో పనిచేస్తుంది.

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo