Moto G9: Snapdragon 662 చిప్ సెట్ తో విడుదలైన మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్

Moto G9: Snapdragon 662 చిప్ సెట్ తో విడుదలైన మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

Moto G9 స్మార్ట్ ఫోన్ను ఈరోజు మోటోరోలా ఇండియాలో విడుదల చేసింది.

ఈ మోటో G9 స్మార్ట్ ఫోన్ వెనుక 48MP ట్రిపుల్ కెమేరా, పెద్ద బ్యాటరీ మరియు లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ స్పీడ్ ప్రాసెసర్ తో మార్కెట్లోకి అడుగుపెట్టింది.

మోటో G9 మొబైల్ ఫోన్ యొక్క మొదటి సెల్ ఆగస్టు 31 న మధ్యాహ్నం 12 గంటలకి జరగుతుంది.

Moto G9 స్మార్ట్ ఫోన్ను ఈరోజు మోటోరోలా ఇండియాలో విడుదల చేసింది. ఎటువంటి ఆన్లైన్ కార్యక్రమం లేకుండా నేరుగా ఈ స్మార్ట్ ఫోన్నువిడుదల చేసింది. ప్రస్తుత మార్కెట్లో 12 వేల ధర విభాగంలో ఉన్న స్మార్ట్ ఫోన్లకు పోటీగా కేవలం రూ.11,499 రూపాయల ధరతో లాంచ్ చేయబడింది. అయితే, ఈ మోటో G9 స్మార్ట్ ఫోన్ వెనుక 48MP ట్రిపుల్ కెమేరా, పెద్ద బ్యాటరీ మరియు లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ స్పీడ్ ప్రాసెసర్ తో మార్కెట్లోకి అడుగుపెట్టింది.                   

Moto G9 Price

Moto G9  కేవలం 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్ తో మాత్రమే లాంచ్ అయ్యింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే, ఇది కేవలం రూ .11,499 ధరతో మార్కెట్లో ప్రవేశించింది.  మోటో G9 మొబైల్ ఫోన్ యొక్క మొదటి సెల్ ఆగస్టు 31 న మధ్యాహ్నం 12 గంటలకి జరగుతుంది. ఈ సేల్  Flipkart  ద్వారా జరుగుతుంది.

Moto G9 ప్రత్యేకతలు

Moto G9 : డిస్ప్లే

ఈ మోటో G9 స్మార్ట్ ఫోన్ ఒక 6.5-అంగుళాల HD + డిస్ప్లే తో వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో లాంచ్ చేయబడింది. ఈ స్క్రీన్ మీకు 20: 9 యాస్పెక్ట్ రేషియో లభిస్తోంది కాబట్టి ఎక్కువ స్క్రీన్ ఏరియా మీకు అందుతుంది.

Moto G9: పెర్ఫార్మెన్స్ 

మోటో G9 స్మార్ట్ ఫోన్, Snapdragon 662 చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది మరియు ఈ చిప్సెట్ తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా Moto G9 నిలుస్తుంది.  ఇది ఆక్టా-కోర్ CPU  మరియు Adreno 610 GPU తో వస్తుంది. ఇక ప్రాసెసర్ కి జతగా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ జతగా వస్తుంది. ఒక  మైక్రో SD కార్డ్ సహాయంతో 512 GB వరకూ స్టోరేజ్ కూడా పెంచవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 తో  నడుస్తుంది.

Moto G9 Camera

మోటో G9 స్మార్ట్ ఫోన్ లో, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ లో 48 MP  ప్రైమరీ కెమెరా అమర్చారు, దీనికి జతగా 2 MP మ్యాక్రో  కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ ను కూడా అందించారు. ముందుభాగంలో, ఈ ఫోన్ లో 8 MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఇది ఫోన్ లో ఉన్న వాటర్ డ్రాప్ నోచ్ లో కనిపిస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో LED  ఫ్లాష్ ను కూడా చతురస్రాకారపు కెమేరా మాడ్యూల్ లో చూడవచ్చు.

Moto G9 బ్యాటరీ & సెక్యూరిటీ

ఇక సెక్యూరిటీ మరియు బ్యాటరీ విషయానికి వస్తే, ఈ G9 స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ లో వేలిముద్ర సెన్సార్ ను అందించారు. అదనంగా, ఈ ఫోన్ లో ఒక పెద్ద 5000 mAh సామర్థ్యం గల బ్యాటరీతో మరియు 20 వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, ఈ బ్యాటరీ 20W టర్బో స్పీడ్ ఛార్జింగ్ సాంకేతికతో ఉంటుంది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ మరియు సఫైర్ బ్లూ వంటి రెండు వేర్వేరు రంగులలో కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo