మోటోరోలా మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. అదే, Moto G73 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 930 5G ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్ గా నిలిచింది. మోటోరోలా ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను 13 ఇండియన్ 5G బ్యాండ్స్ కి సపోర్ట్ తో అందించింది మరియు ఈ ఫోన్ తో మంచి అఫర్ ను కూడా జత చేసింది. ఈరోజే ఇండియాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్, ధర మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Moto G73 5G: ధర మరియు ఆఫర్లు
Moto G73 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం 8GB RAM + 128GB స్టోరేజ్ సింగిల్ అప్షన్ తో రూ.18,999 ధరతో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ పైన అందించిన ఎక్స్ చేంజ్ అఫర్ లో భాగంగా 2,000 అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Moto G73 5G స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ FHD+ IPS LCD డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు ఫోన్ 8.29. మందతో ఉంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 930 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగివుంటుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP+8MP రియర్ కెమెరాతో వుంది. ఇందులోని మైన కెమేరా 2 um Ultra-Pixel technology తో వస్తుంది. ముందు పంచ్ హోల్ లో 16MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇది నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 13 OS, BT 5.2, 4x4MIMO మరియు 13 ఇండియన్ 5G బ్యాండ్స్ కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని కూడా మోటో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile