Moto G62 5G ఫోన్ పైన రూ.3,000 భారీ తగ్గింపు.!
Moto G62 5G ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది
ఈ స్మార్ట్ ఫోన్ రూ.3,000 భారీ తగ్గింపు అందుకుంది
ఈ భారీ తగ్గింపు తరువాత బడ్జెట్ ధరలోనే లభిస్తోంది
మోటోరోలా ఇటీవల ప్రకటించిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Moto G62 5G ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమేరా, స్టాక్ ఆండ్రాయిడ్, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ రూ.3,000 భారీ తగ్గింపు అందుకుంది. ఈ భారీ తగ్గింపు తరువాత ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలోనే లభిస్తోంది.
SurveyMoto G62 5G: అఫర్ ధర
Moto G62 5G బేసిక్ వేరియంట్ (6GB+128GB) రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ 2,000 రూపాయల తగ్గింపుతో రూ.15,999 రూపాయలకే లభిస్తోంది. హై ఎండ్ వేరియంట్ (8GB+128GB) రూ.19,999 ధరతో లాంచ్ కాగా ఇప్పుడు రూ.16,499 రూపాయలకే లభిస్తోంది. అంటే, ఈ వేరియంట్ పైన 3500 రుపాయల తగ్గింపు మీకు లభిస్తుంది.
Moto G62 5G: స్పెక్స్
Moto G32 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ Fluid డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు బ్రిలియంట్ కలర్ తో వుంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫంక్షన్ రియర్ కెమెరాతో వుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా 2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile