Moto G52: భారీ ఆఫర్లు మరియు ఫీచర్లతో వచ్చింది..!!

HIGHLIGHTS

మోటరోలా తన G సిరీస్ పరిధిని విస్తరించింది.

మోటరోలా G సిరీస్ నుండి Moto G52 ను ప్రకటించింది

ఈ ఫోన్ నేచురల్ కలర్స్ అందించగల pOLED డిస్ప్లేతో వచ్చింది

Moto G52: భారీ ఆఫర్లు మరియు ఫీచర్లతో వచ్చింది..!!

మోటరోలా తన G సిరీస్ పరిధిని విస్తరించింది. ఈరోజు ఇండియాలో మోటరోలా G సిరీస్ నుండి Moto G52 ను ప్రకటించింది. ఈ లేటెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్‌లో యాడ్-ఫ్రీ మరియు బ్లోట్-ఫ్రీ సాఫ్ట్‌ వేర్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ నేచురల్ కలర్స్ అందించగల pOLED డిస్ప్లే, 50MP క్వాడ్ ఫంక్షన్ రియర్ కెమెరా సెటప్, బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ తో సహా చాలా ఫీచర్లను కలిగివుంది. ఇండియన్ మర్కెట్లో ఈరోజే అడుగుపెట్టిన ఈ సరికొత్త మోటరోలా స్మార్ట్ ఫోన్ గురించి వివరంగా చూద్దాం.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G52: ధర మరియు ఆఫర్లు

మోటో జి52 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ.14,499 ప్రారంభ ధరతో వచ్చింది. ఇది 4GB మరియు 64GB మోడల్ కోసం నిర్ణయించిన ధర. 6GB మరియు 128GB మోడల్ ధర రూ.15,499. పరిచయ ఆఫర్‌లో భాగంగా, HDFC క్రెడిట్ కార్డ్ లేదా EMI ట్రాన్సాక్షన్ తో రూ.1000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ మే 3 నుండి Flipkart మరియు ఇతర అవుట్ లెట్స్ ద్వారా అమ్మకానికి వస్తుంది.

మీరు రిలయన్స్ జియో నుండి ఈ ఫోన్ పైన రూ.2,549 విలువైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు:

రీఛార్జ్‌పై రూ.2,000 క్యాష్‌బ్యాక్

ZEE5 వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ పై రూ.549 తగ్గింపు

Moto G52-2.jpg

Moto G52: స్పెక్స్

మోటో జి52 స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ నేచురల్ కలర్స్ అందించగల pOLED డిస్ప్లేని కలిగివుంది మరియు ఈ డిస్ప్లే పైన మధ్యలో పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మోటో జి52 యాడ్-ఫ్రీ Android 12 OS పైన నడుస్తుంది. డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ తో మెమొరీని విస్తరించవచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ ఫిక్షన్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్  ఉన్నాయి మరియు ఇది మూడు కెమెరాలతోనే నాలుగు కెమెరాల పనిచేస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో వున్నా సెంటర్ పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది.  ఈ ఫోన్ 33W టర్బో పవర్  ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో-సిమ్, USB-C సాకెట్,ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 తో ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo