రూ.3,000 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న Moto G32 స్మార్ట్ ఫోన్.!
Moto G32 ఫ్లిప్ కార్ట్ నుండి రూ.3,000 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది
మంచి ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో వచ్చిన Moto G32
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క ఆఫర్లు మరియు స్పెక్స్ తెలుసుకోండి
మోటోరోలా ఇండియాలో ఇటీవల విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Moto G32 ఫ్లిప్ కార్ట్ నుండి రూ.3,000 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. మంచి ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పైన 10% అదనపు తగ్గింపు పొందేలా బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పైన అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క ఆఫర్లు మరియు స్పెక్స్ తెలుసుకోండి.
SurveyMoto G32: అఫర్ ధర
Moto G32 స్మార్ట్ ఫోన్ రూ.12,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. అయితే, ఈరోజు Flipkart నుండి రూ.3,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.9,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. మోటో జి32 ఫోన్ ను IDFC మరియు BoB క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనేవారికి 999 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది.
Moto G32: స్పెక్స్
Moto G32 ఫోన్ 6.55 ఇంచ్ FHD+ IPSLCD డిస్ప్లేని ఈ ఫోన్ కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ లను అందిస్తుంది.
కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతోని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా 2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IPX2 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile