Moto G32: భారీ అఫర్ తో రేపు మొదటి సేల్.!!

Updated on 15-Aug-2022
HIGHLIGHTS

మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Moto G32

Moto G32 యొక్క ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం జరగనుంది

రేపు భారీ బ్యాంక్ ఆఫర్ తో Flipkart నుండి మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది

మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Moto G32 యొక్క ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం జరగనుంది. మోటోరోలా G32 బడ్జెట్ మొబైల్ కేటగిరిలో Dolby Atoms సపోర్ట్ మరియు 50MP క్వాడ్ ఫంక్షన్ కెమెరా వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ రేపు భారీ బ్యాంక్ ఆఫర్ తో Flipkart నుండి మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.      

Moto G32: ధర మరియు లాంచ్ ఆఫర్లు

Moto G32 కేవలం రూ.12,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ ఆగష్టు 16 మధ్యాహ్నం Flipkart నుండి సేల్ కి వస్తుంది. ఈ ఫోన్ పైన కంపెనీ లాంచ్ అఫర్ ను కూడా ప్రకటించింది. మోటో జి32 ఫోన్ ను HDFC కార్డ్స్ ద్వారా కొనేవారికి 1,000 రూపాయల తగ్గింపు లభిస్తుంది.  

Moto G32: స్పెక్స్

Moto G32 ఫోన్ 6.55 ఇంచ్ FHD+ IPSLCD డిస్ప్లేని ఈ ఫోన్ కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు  20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతోని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా  2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IPX2 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :