Snapdragon 8 Gen 1 తో వస్తున్న మోటో ఎడ్జ్ సిరీస్ స్మార్ట్ ఫోన్

Updated on 16-Feb-2022
HIGHLIGHTS

ఈ అప్ కమింగ్ స్మార్ట్ Moto Edge 30 Pro కావచ్చని ఊహిస్తున్నారు

ఈ ఫోన్ Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో వస్తోంది

సెల్ఫీ కెమెరా గురించి ప్రత్యేకముగా చూపిస్తోంది

మోటోరోలా ఇండియాలో ఈ నెల 24 న ఎడ్జ్ సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ Moto Edge 30 Pro కావచ్చని ఊహిస్తున్నారు. ఇటీవల చైనాలో విడుదల చేసిన Moto Edge X30 ను రీబ్రాండ్ చేసి మోటో ఎడ్జ్ 30 ప్రో పేరుతో ఇండియాలో విడుదల చేయవచ్చని కూడా ఊహిస్తున్నారు. అంతేకాదు, మోటోరోలా అధికారిక ట్విట్టర్ పేజ్ నుండి షేర్ చేసిన లేటెస్ట్ టీజర్ ద్వారా ఈ ఫోన్ Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో వస్తున్నట్లు మరియు సెల్ఫీ కెమెరా గురించి ప్రత్యేకముగా చూపిస్తోంది. అన్ని విషయాలను పరిశీలిస్తే అందరూ ఊహిస్తున్నట్లు గానే జరగవచ్చని భావిస్తున్నారు.  

అంతేకాదు, Motorola తన Edge X30 ని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయాలని చూస్తున్నట్లు చాలా కాలంగా పుకారు ఉంది. అయితే,  దీన్ని వేరే పేరుతో రీబ్రాండింగ్ చేసి లాంచ్ చేయాలని చూస్తోందని ఈ రూమర్లు చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే చైనాలో 60MP సెల్ఫీ కెమేరా Snapdragon 8 Gen 1 తో వచ్చిన Edge X30 స్మార్ట్ ఫోన్ X 30 Pro పేరుతో రావచ్చు.        

Moto Edge X30: స్పెక్స్

Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హాయ్ ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 12GB వరకు ర్యామ్ మరియు UFS 3.1 256GB వరకూ స్టోరేజ్ అందిస్తుంది.  

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP ప్రధాన సెన్సార్ కి జతగా5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు  2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో అందించింది.         

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :