Moto Edge 40 5G స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ సేల్ కోసం చూస్తున్నారా.!

HIGHLIGHTS

Moto Edge 40 స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ సేల్ జూన్ 14 న మొదలవుతుంది

Flipkart ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది

చాలా సన్నగా మరియు IP68 రేటింగ్ ని కూడా కలిగి వుంది

Moto Edge 40 5G స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ సేల్ కోసం చూస్తున్నారా.!

Moto Edge 40 స్మార్ట్ ఫోన్ సేల్ ను వెంట వెంటనే ప్రకటిస్తోంది కంపెనీ. స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుండి కూడా మంచి స్పందనను అందుకుంది మరియు ఈరోజు 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మరొకసారి సేల్ కు అంధుబాటులోకి వస్తోంది. ఈ మోటో స్మార్ట్ ఫోన్ కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో 3D Curved డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు  eSIM సపోర్ట్ తో వచ్చిన ఫోన్ గా నిలుస్తుంది.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఫోన్ యొక్క నెక్స్ట్ సేల్ వివరాల్లోకి వెళితే, Moto Edge 40 స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ సేల్ జూన్ 14 న మొదలవుతుందని మోటోరోలా ప్రకటించింది. Flipkart ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ రూ. 29,999 ధరతో లాంచ్ అయ్యింది మరియు అదే రేటుతో సేల్ అవుతుంది. 

Moto Edge 40: ప్రధాన ఆకర్షణలు 

Moto Edge 40 ఫోన్ లో 5 ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి మరియు ఈ ఫోన్ పైన మరింత హైప్ పెంచేలా చేస్తునట్లు చెప్పవచ్చు. ఈ మోటో స్మార్ట్ ఫోన్ 3D Curved డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. మోటోరోలా ఈ ఫోన్ ను మెటల్ ఫ్రెమ్ మారియు ప్రీమియం లెథర్ తో చక్కని డిజైన్ మరియు IP68 రేటింగ్ తో కూడా అందించింది.

ఈ మోటో ఫోన్ ఫిజికల్ SIM కార్డ్ స్లాట్ తో పాటు eSIM సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ 50MP OIS డ్యూయల్ కెమేరాని 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. దీని ప్రోసెసర్ గురించి చెప్పాలంటే, మీడియాటెక్ Dimensity 8020 5G ప్రోసెసర్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫాస్ట్ ప్రోసెసర్ కి జతగా 8GB మరియు హెవీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ముఖ్యంగా, ఈ మోటో ఫోన్ యాడ్స్ మరియు బ్లోట్ వేర్ లేని Android 13 OS పైన పని చేస్తుంది. ఈ మోటో ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జ్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo