Moto Edge 30 Pro: ఇండియాలో విడుదలైన మోటో 60MP సెల్ఫీ కెమెరా ఫోన్

Updated on 25-Feb-2022
HIGHLIGHTS

Moto Edge 30 Pro స్మార్ట్ ఫోన్ విడుదల

భారీ 60MP సెల్ఫీ కెమెరా కలిగిన మొదటి ఫోన్

50MP + 50MP +2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

గత కొంత కాలంగా మోటోరోలా టీజింగ్ చేస్తున్న Moto Edge 30 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో భారీ 60MP సెల్ఫీ కెమెరా కలిగిన మొదటి ఫోన్ అవుతుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ 10బిట్ AMOLED ప్యానల్, వేగవంతమైన క్వాల్కమ్ ప్రోసెసర్ మరియు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది.

Moto Edge 30 Pro:

మోటో ఎడ్జ్ 30 ప్రో ఒక హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది రూ.49,999 రూపాయాల ప్రీమియం ధరతో వచ్చింది. అయితే, ఈ ఫోన్ పైన కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్ ను కూడా మోటోరోలా అందించింది. SBI క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 5,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ మార్చ్ 4 వ తేదీ నుండి Flipkart మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ లో లభిస్తుంది.           

Moto Edge 30 Pro : సెక్స్

Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హై ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. 

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP OIS ప్రధాన సెన్సార్ కి జతగా 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు  2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో అద్భుతమైన ఫోటో గ్రఫీని ఎంజాయ్ చేయవచ్చని మోటో తెలిపింది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో అందించింది.      

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :