Moto E7 Plus: అల్ట్రా కెమేరా, స్టాక్ ఆండ్రాయిడ్ తో లాంచ్

Moto E7 Plus: అల్ట్రా కెమేరా, స్టాక్ ఆండ్రాయిడ్ తో లాంచ్
HIGHLIGHTS

మోటరోలా తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్ Moto E7 Plus ‌ను భారత్‌లో విడుదల చేసింది.

గొప్ప కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ మరియు ప్రాసెసర్ ఈ మోటో ఇ 7 ప్లస్ యొక్క ప్రత్యేక ఫీచర్లు.

Moto E7 Plus ఎటువంటి బ్లోట్ వేర్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది

మోటరోలా తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్ Moto E7 Plus ‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌ ను కొద్ది రోజుల క్రితం బ్రెజిల్‌లో లాంచ్ చేశారు. గొప్ప కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ మరియు ప్రాసెసర్ ఈ ఫోన్ యొక్క ప్రత్యేక ఫీచర్లు. ఈ మోటో ఇ 7 ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 30 న మధ్యాహ్నం 12 నుండి అమ్మకానికి వస్తుంది. ఈ ఫోన్ మిస్టి బ్లూ మరియు ట్విలైట్ ఆరెంజ్‌ కలర్స్ లో లభిస్తుంది. భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ .9,499. ముఖ్యంగా, ఇది ఎటువంటి బ్లోట్ వేర్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది.  

Moto E7 Plus: స్పెసిఫికేషన్

మోటో ఇ7 ప్లస్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించబడింది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1600 x 720 పిక్సెల్ రిజల్యూషన్  మరియు 20: 9 ఎస్పెక్ట్ రేషియాతో వుంటుంది. గ్రాఫిక్స్ కోసం, ఈ ఫోన్ ‌లో క్వాల్‌కామ్ యొక్క 1.6 GHz స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ మరియు అడ్రినో 610 GPU ఉన్నాయి. ఈ ఫోన్ ‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి, ఒక డేడికేటెడ్ మెమరీ కార్డ్ సహాయంతో స్టోరేజ్ మరింతగా విస్తరించవచ్చు. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 OS ‌పైన పనిచేస్తుంది. ఈ మోటో ఇ 7 ప్లస్ ఫోన్ ‌ను ఫింగర్ ప్రింట్ సెన్సార్ ‌తో కూడా లాంచ్ చేశారు.

Moto E7 Plus: కెమెరా

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ మోటరోలా మోటో ఇ 7 ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ క్లైగి ఉంటుంది. ఇందులో, 48 మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరాని f / 1.7 ఎపర్చర్‌ తో కలిగి ఉంది. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెళ్ల డెప్త్ సెన్సార్ వుంటుంది. ఇక సెల్ఫీల కోసం, ఇది f / 2.2 ఎపర్చర్ గల 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ ‌ను శక్తివంతమైనదిగా చేయడానికి, ఈ ఫోన్‌ లో 5,000 mAh బ్యాటరీ ఉంది, ఇది 10 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్ ‌ను పూర్తి ఛార్జీతో ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఛార్జింగ్ కోసం మైక్రో USB పోర్ట్ కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 4 జి, బ్లూటూత్ వి 5, వై-ఫై, మైక్రో యుఎస్‌బి మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo