మిడ్ రేంజ్ ఫోన్ల ప్రత్యేకతల పోలిక : నోకియా 5.1 ప్లస్ vs రియల్ మి 2

HIGHLIGHTS

నేడు, మనము నోకియా 5.1 ప్లస్ ని రియల్ మి 2 తో పోల్చి చూడనున్నాము. నోకియా 5.1 ప్లస్ ఇండియాలో 10,999 రూపాయల ధరకే ఉంది, ఇది రియల్ 2 కూడా అదే మధ్య శ్రేణి విభాగంలో ఉంది.

నోకియా 5.1 ప్లస్ గత నెలలో భారతదేశంలో నోకియా 6.1 ప్లస్ తోపాటుగా పరిచయం చేయబడింది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి దీని ధర రూ .10,999 గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ రియల్ 2 యొక్క ప్రధాన పోటీదారుగా రూపుదిద్దుకుంది, ఈ రెండు కూడా మధ్య స్థాయి ఫోన్లు కాబట్టి లక్షణాల పరంగా ఎలా నిలుస్తాయనేది ఇక్కడ చూద్దాం.

Products

Nokia 5.1 Plus

Realme 2

Launch price

Rs 10,999

Rs 8,990

Display

5.86-inch

6.2-inch

Resolution

720 x 1520 pixels

720 x 1520 pixels

Processor make

MediaTek

Helio P60

Qualcomm Snapdragon 450

Processor

1.80GHz octa-core

1.80GHz octa-core

RAM

3GB

3GB

Internal storage

32GB

32GB

Expandable storage

400GB

256GB

Rear camera

13MP + 5MP

13MP + 2MP

Rear Flash

Yes

Yes

Front camera

8MP

8MP

Android version

8.1 Oreo

8.1 Oreo

Sim slot

Dual

Dual

మనము ఈ రెండు పరికరాలను పోల్చి చూడడానికి ముందుగా ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ధరలను ఒకసారి పరిశీలిద్దాం.

రియల్ మి 2       : 4GB / 64GB  – ధర రూ .10,990 మరియు 3GB / 32GB – ధర రూ .8,990

 నోకియా 5.1 ప్లస్ : 3GB / 32GB  – ధర రూ .10,990 .

ఇప్పుడు, ఈ రెండు పరికరాల డిస్ప్లే లను పోల్చి చూద్దాం : నోకియా 5.1 ప్లస్ ఒక 5.86-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, అయితే, రియల్ మి 2 యొక్క  6.2 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో పోలిస్తే  కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రెండు పరికరాల రిజల్యూషన్  ఒకేలా ఉంటుంది, అది  720 x 1520 పిక్సెల్స్. ఇంకా, మీరు ఒక పెద్ద డిస్ప్లేతో ఒక స్మార్ట్ఫోన్ను కోరుకుంటే, అప్పుడు రియల్ మి 2 ను పరిశీలించవచ్చు.

వీటి పనితీరు విషయానికి వస్తే, ఈ నోకియా 5.1 ప్లస్ ఒక మీడియా టెక్ హీలియో P60 ఆక్టా – కోర్ ప్రాసెసర్ చేత శక్తిని కలిగి ఉంది, మరోవైపు రియల్ మి 2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ఆక్టా – కోర్ ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది. కెమెరా పరంగా, ఈ రెండు స్మార్ట్ఫోన్లు ముందు 8MP యూనిట్ కలిగి ఉంటాయి. అయితే, నోకియా 5.1 ప్లస్ వెనుక 13MP + 5MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది, ఇంక రియల్ మి 2 13MP + 2MP వెనుక కెమెరాతో అమర్చబడి ఉంటుంది.

కొనుగోలుదారులు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే నోకియా 5.1 ప్లస్ గూగుల్ యొక్క Android One కార్యక్రమంలో భాగం, దీనర్థం వారు Google ద్వారా అప్డేట్ విడుదల చేయబడిన వెంటనే ఈ అప్డేట్ లను పొందడానికి ఇది ముందంజలో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :