రెడ్మి Y3 పైన భారీ డిస్కౌంట్ మరియు 7,500 వరకు ఎక్స్చేంజి అఫర్
SBI బ్యాంక్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 5% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
షావోమి, ఈ రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్ ఒక 32MP సెల్ఫీ కెమెరా మరియు 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా వంటి కెమేరా ప్రత్యేకతలతో విడుదల చేసింది. ఒక 32MP సెల్ఫీ కెమేరాతో కేవలం బడ్జెట్ ధరలో వచ్చినటువంటి ఈ REDMI Y3 స్మార్ట్ ఫోన్, భారతీయ బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని తీసుకొచ్చింది.
Surveyఅయితే, ముందుగా రూ. 9,999 ప్రారంభ దరతో తీసుకొచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ పైన 1,000 రూపాయాల భారీ డిస్కౌంట్ మరియు ఫోన్ మార్చుకోవాలనుకునేవారికి 7,500 వరకు ఎక్స్చేంజి అఫర్ ని కూడా అందిస్తోంది. ఈ ఆఫరును అమేజాన్ ఇండియా ద్వారా కొనేవారికి వర్తింప చేసింది.
షావోమి రెడ్మి Y3 : అఫర్ ధరలు మరియు ఇతర ఆఫర్లు
1. షావోమి రెడ్మి Y3 – 3GB RAM + 32GB స్టోరేజి ధర – 8,999
2. షావోమి రెడ్మి Y3 – 4GB RAM + 64GB స్టోరేజి ధర – 10,999
ఈ ఫోనుతో పాటుగా ఎయిర్టెల్ యొక్క భాగస్వామ్యంతో 1120GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో అందించింది. అలాగే, SBI బ్యాంక్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 5% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అధనంగా, 7,500 వరకు ఎక్స్చేంజి అఫర్ ని కూడా అందిస్తుంది.
షావోమి రెడ్మి Y3 ప్రత్యేకతలు
షావోమి రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్, HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. అలాగే, ఇందులో అందించిన లో బ్లూ లైట్ టెక్నలాజితో రాత్రి సమయాల్లో కళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తుందని కంపెనీ చెబుతుంది. అధనంగా, ఈ స్క్రీన్ ఒక గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది ప్రిజం బ్లూ, ప్రైమ్ బ్లాక్ మరియు బోల్డ్ రెడ్ వంటి కలర్ ఎంపికలతో ఎంచుకునేలా లభిస్తుంది.
ఇక కెమెరా విభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 12MP ప్రధాన కెమరా మరియు 2MP పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 32MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా HDR తో వీడియోలను తీసుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇందులో అందించిన సెల్ఫీల కెమేరాతో మంచి ఫోటోలను క్లిక్ చెయ్యవచు.