రెడ్మి Y3 కేవలం రూ.4,999 మాత్రమే : ఫ్లాష్ సేల్ 4 గంటలకు మొదలు

HIGHLIGHTS

Mi బ్యాగ్ ని కూడా కేవలం 499 రూపాయల ధరకే అమ్మనుంది.

 షావోమి సంస్థ తన షావోమి 5 వ వార్షికోత్సవ  మహోత్సవాన్ని పురస్కరించుకొని, తన అభిమానులకు గొప్ప అఫర్ ని అందిస్తోంది.అదే, షావోమి హాఫ్ ప్రైస్ సేల్. అంటే సగం ధరకే మొబైల్ ని అమ్మకం చేస్తుంది. ఇందులో భాగంగా, లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మి Y ని కేవలం రూ.4,999 ధరకే అమ్ముడు చేస్తోంది. ఈ విషయాన్ని తన సొంత వెబ్ పేజీలో అందించింది.

దీని ప్రకారంగా, ఈ సేల్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మరియు 6 గంటలకి మాత్రమే చేపట్టనుంది. అయితే, అన్ని యూనిట్లను మాత్రం కాదు, కేవలం 100 యూనిట్లను మాత్రమే ఈ ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మనుంది. అలాగే, దీనితో పాటుగా 999రూపాయల విలువ గల Mi బ్యాగ్ ని కూడా కేవలం 499 రూపాయల ధరకే అమ్మనుంది. అయితే, ఈ బ్యాగ్ లను కూడా కేవలం 200 యూనిట్లను మాత్రమే ఈ ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మనుంది.

షావోమి రెడ్మి Y3  ప్రత్యేకతలు

షావోమి రెడ్మి Y3  స్మార్ట్ ఫోన్,  HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. అలాగే, ఇందులో అందించిన లో బ్లూ లైట్ టెక్నలాజితో రాత్రి సమయాల్లో కళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తుందని కంపెనీ చెబుతుంది. అధనంగా, ఈ స్క్రీన్ ఒక గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది ప్రిజం బ్లూ, ప్రైమ్ బ్లాక్ మరియు బోల్డ్ రెడ్ వంటి కలర్ ఎంపికలతో  ఎంచుకునేలా లభిస్తుంది.

ఇక కెమెరా విభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 12MP + 2MP  డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 12MP ప్రధాన కెమరా మరియు 2MP పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 32MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా HDR తో వీడియోలను తీసుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇందులో అందించిన సెల్ఫీల కెమేరాతో మంచి ఫోటోలను క్లిక్ చెయ్యవచు.                     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :