Mi 11X: భారీ ఆఫర్లతో మి 11X మొదటి సేల్

Updated on 27-Apr-2021
HIGHLIGHTS

Mi 11X యొక్క మొదటి సేల్

రూ. 3,500 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్

E4 AMOLED డిస్ప్లే

షియోమి తన Mi 11 సిరీస్ స్టార్టింగ్ వేరియంట్ Mi 11X ను ఇటీవల ఇండియాలో విడుదల చేసింది. ఈరోజు ఈ Mi 11X యొక్క మొదటి సేల్ జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు జరగనున్న మొదటి సేల్ నుండి చాలా మంచి ఆఫర్లతో వస్తుంది. ఈ ఫోన్ ను 3,500 రూపాయల డిస్కౌంట్ తో కొనుగోలు చెయ్యవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ తో ప్రకటించిన బండిల్ అఫర్ తో Mi Band 5 ను కేవలం 500 రూపాయలకే పొందవచ్చు. ఈ ఫోన్ లో అందించిన ఫీచర్లు కూడా సూపర్ గా ఉంటాయని చెప్పొచ్చు.

Mi 11X అఫర్ :

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు సులభ EMI ల పైన రూ. 3,500 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. బండిల్ అఫర్ తో Mi Band 5 ను కేవలం 500 రూపాయలకే పొందవచ్చు.                 

Mi 11X : ధర

Mi 11X (6జీబీ + 128 జీబీ ) : రూ.29,999

Mi 11X (8జీబీ + 128 జీబీ ) : రూ.31,999

Mi 11X : ప్రత్యేకతలు

Mi 11X స్మార్ట్ ఫోన్ పెద్ద 6.67 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డాట్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వుంటుంది మరియు ఇది E4 AMOLED డిస్ప్లే. ఇది 1300 నైట్స్ బ్రైట్నెస్ అందించగలదు.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది 7nm ఫ్యాబ్రికేషన్ ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది MIUI 12 ఆధారితంగా వస్తుంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos మరియు Hi-Res సౌండ్ టెక్నాలజీతో వస్తుంది.

ఇక కెమెరాల విషయంలో, Mi 11X  వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో, ప్రధాన కెమెరాని 48MP సెన్సార్   f/1.79 అపర్చర్ తో అందించింది. దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్ మరియు 5MP టెలీ మ్యాక్రో సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 20MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 4,520 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W  ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. .

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :