గెలాక్సీ M 30s ఒక 6,000 బ్యాటరీ, 48MP ట్రిపుల్ కెమేరాతో మిడ్ రేంజ్ దార్లో విడుదలయ్యే అవకాశం

HIGHLIGHTS

గెలాక్సీ M 30s యొక్క కేస్ రెండర్లు కూడా లీక్ అయ్యాయి

ఇప్పుడు, శామ్సంగ్ తన స్మార్ట్ ఫోన్లను ఎడతెరిపిలేకుండా లాంచ్ చేస్తోంది. A10 లతో గెలాక్సీ ఎ సిరీస్‌లో “s ” ను ప్రవేశపెట్టిన తరువాత, ఈ టెక్ దిగ్గజం దీనిని M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా పరిచయం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. లీకైన టీజర్ యొక్క మూలం తెలియదు, కానీ ఇది 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో M -సిరీస్ స్మార్ట్‌ఫోన్ రావడానికి సిద్ధంగా ఉందని సూచిస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ M 30s భారీ బ్యాటరీని ప్యాక్ చేసే అవకాశం ఉందని సామ్‌మొబైల్ తెలిపింది.

లీకైన ఒక టీజర్ ప్రకారం,  గెలాక్సీ M 30s లో ఒక పెద్ద బ్యాటరీ సామర్థ్యాన్ని సూచిస్తుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేయగలదని ఇది సూచిస్తుంది. గెలాక్సీ M 30s యొక్క కేస్ రెండర్లు కూడా లీక్ అయ్యాయి, ఇది ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ వివరాలను వెల్లడించింది.

ఇక బ్యాక్ కేసు రెండర్‌కి వస్తున్నప్పుడు, గెలాక్సీ M30s ఒక  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను నిలువుగా సమలేఖనం చేసినట్లు కనిపిస్తోంది, ఇది వెనుక ప్యానెల్ యొక్క ఎడమ ఎగువ భాగంలో ఉంచబడుతుంది. అంతేకాక, వెనుక వేలిముద్ర సెన్సార్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ యొక్క కుడి అంచున వాల్యూమ్ మరియు పవర్ బటన్లు ఉన్నాయి.

గెలాక్సీ M 30s ధర విషయానికి వస్తే, ఇది రూ .15 వేల నుంచి రూ .20,000 మధ్య ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుంది. అయితే, ఇవాన్నీ కూడా కేవలం నెట్టింట్లో వస్తున్న ఉహాగానాలు మాత్రమే. అయితే, గెలాక్సీ M30s యొక్క ధర మరియు లాంచ్ తేదీ గురించి సంస్థ ఇంకా అధికారిక ప్రకటించలేదు.

శామ్‌సంగ్ గెలాక్సీ M 30s ప్రత్యేకతలు (అంచనా)

శామ్‌సంగ్ గెలాక్సీ M 30s ఒక 6.4-అంగుళాల FHD + (2400 x 1080) పిక్సెల్స్ రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఇది 6GB RAM వరకు జత చేసిన ఎక్సినోస్ 9610 చిప్‌సెట్ ద్వారా శక్తినివ్వగలదు. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందవచ్చు అవి: 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, మరియు 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్.

కెమెరా విభాగంలో, ఈ గెలాక్సీ M30s  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి, వీటిలో 48MP f / 2.0 సెన్సార్, 8MP f / 2.2 అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 5MP f / 2.2 డెప్త్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ముందు కెమెరా ఒక 16MP సెల్ఫీ కెమేరా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :