బ్లాక్ షార్క్ 3 ఒక భారీ 16GB ర్యామ్ తో రావచ్చు

Updated on 13-Jan-2020
HIGHLIGHTS

ఇది రాబోయే బ్లాక్ షార్క్ 3 5 జి కావచ్చు.

ప్రత్యేకమైన గేమింగ్ స్మార్ట్‌ ఫోన్, బ్లాక్ షార్క్ కు సంబంధించిన ఒక ప్రత్యేక వార్త ఇప్పుడు బయటకి వచ్చింది. ఇది భారీ గేమింగ్ వినియోగదారుకు చాలా ప్రత్యేకమైనదిగా రానున్నట్లు ఈ వార్త చెబుతోంది. మీరు అత్యధికమైన మరియు భారీ 10GB లేదా 12GB RAM ను ఉపయోగించాలని చూస్తుంటే, ఇప్పుడు మీ కోరిక మరింత పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంటర్నెట్‌లో వస్తున్నా ఆన్లైన్ కధనాల ప్రకారం, బ్లాక్ షార్క్ 3 ను ఒక భారీ 16 జీబీ ర్యామ్‌ తో లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లో తదుపరి పెద్ద దశ అవుతుంది. ఇది జోక్ అని కొట్టిపారేయకండి, ఎందుకంటే స్మార్ట్‌ ఫోన్ గురించి 16 జిబి ర్యామ్ ల్యాప్‌ టాప్ గురించి కాదు.

బ్లాక్ షార్క్ 3 5 G అనే డివైజ్,  చైనీస్ సర్టిఫికేషన్ సైట్ MIIT చేత ధృవీకరణ పొందింది. ఇది 16 జీబీ ర్యామ్‌ తో ఫోన్ను అందించవచ్చని సర్టిఫికేషన్‌లో స్పష్టమైంది. ఇది గనుక జరిగితే, ఈ డివైజ్ 16GB RAM కలిగి ఉన్న ప్రపంచంలో ఐదవ పరికరం అవుతుంది. టిప్‌స్టర్ @ సుధాన్షు 1414 కొద్ది రోజుల క్రితం ట్వీట్ ద్వారా ఈ ధృవీకరణను వెల్లడించారు. ఈ ఫోనుకు షార్క్ KLE-AO  మోడల్ నంబర్ ఇవ్వబడింది మరియు ఇది రాబోయే బ్లాక్ షార్క్ 3 5 జి కావచ్చు. సిద్ధాంతపరంగా ఇది ప్రపంచంలోని మొట్టమొదటి 16GB ర్యామ్ స్మార్ట్‌ ఫోన్ అవుతుంది, అయినప్పటికీ మనం దీనిగురించిన అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి.

ఇక ముందుగా వచ్చిన బ్లాక్ షార్క్ 2 ప్రో గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోనులో మీరు ఒక స్నాప్‌ డ్రాగన్ 855+ చిప్‌ సెట్‌ ను పొందుతారు. ఇది గొప్ప పనితీరు కనబరిచే పరికరం. మీరు బ్లాక్ షార్క్ 2 ప్రో మొబైల్ ఫోనులో గొప్ప కెమెరాను కూడా పొందుతారు. ఈ మొబైల్ ఫోనులో మీరు 48MP  ప్రధాన సెన్సార్‌ అందుకుంటారు మరియు దీనికి తోడు మీరు సెకండరీ టెలిఫోటో లెన్స్‌ ను కూడా పొందుతారు, ఇది 2X ఆప్టికల్ జూమ్‌ తో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :