iphone 7, iphone XR , iphone SE మరియు iphone 6 S తరువాత, ఇప్పుడు ఆపిల్ సంస్థ iphone 11 ని కూడా భారతదేశంలో తయారచేస్తోంది. ఈ సమాచారాన్ని ఇండియా కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిష్టర్, రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే, ఐఫోన్ 11 ను చెన్నై ఫాక్స్కాన్ ప్లాంట్లో అసెంబుల్ చెయ్యడం కూడా మొదలుపెట్టినట్లు తెలిపారు. భారతదేశంలో ఆపిల్ టాప్-ఆఫ్-ది-లైన్ ఐఫోన్ మోడల్స్ ను తయారు చేయడం ఇదే మొదటిసారి.
2020 – iPhone 11 2019 – iPhone 7 & XR 2018 – iPhone 6S 2017 – iPhone SE This chronology is a statement in itself as to how @narendramodi govt. has developed the mobile phone manufacturing ecosystem in India. It's only a humble beginning. https://t.co/T1ssI1yG6K
ఐఫోన్ 11 కోసం ఈ లోకల్ అసెంబ్లీ లైన్ వాడుకుకోవడం ద్వారా ఆపిల్ లోకల్ అవ్వడంతో ఈ ఫోన్లకు ఇంటర్నేషన్ దిగుమతి సుంకం నుండి మినహాయింపు వుంటుంది కాబట్టి, కంపెనీ చెల్లించాల్సిన 20 శాతం పన్నును నివారించడానికి సహాయపడుతుంది. భారతదేశంలో iphone XR కోసం అసెంబ్లీ లైన్ ప్రవేశపెట్టిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఐఫోన్ 11 లోకల్ తయారీని ప్రకటించారు.
ఆపిల్ 2017 మే లో విస్ట్రాన్ సదుపాయంలో ఐఫోన్ SE తో భారతదేశంలో స్థానికంగా ఐఫోన్ ల తయారీని ప్రారంభించింది. తరువాత దీనిని ఫాక్స్కాన్ సౌకర్యానికి విస్తరిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ లో ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ ను భారతదేశంలో స్థానికంగా తయారు చేయడం ప్రారంభించింది.
ఆపిల్ తన ఐఫోన్ మోడళ్లకు ఫాక్స్కాన్, విస్ట్రాన్ మరియు పెగాట్రాన్ వంటి పెద్ద సప్లయర్స్ ను కలిగి ఉంది. ఆపిల్ కోసం ఐఫోన్ లను అసలు ఎవరు తయారు చేస్తారు, అనే ప్రశ్న ఇంటర్నెట్ లో ఆత్యదికంగా సెర్చ్ చెయ్యబడింది. ఇటీవల, భారతదేశంలో పెగాట్రాన్ ఉత్పత్తి గురించి కూడా పెద్ద వార్తలు వచ్చాయి.
ఇండియాలో ఐఫోన్ మోడల్స్ ను అసెంబుల్ చేస్తున్న ఫ్యాక్టరీని విస్తరించడానికి ఫాక్స్కాన్ 1 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఫాక్స్కాన్ తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐఫోన్ అసెంబుల్ యూనిట్ పెగాట్రాన్, భారతదేశంలో స్థానిక అనుబంధ సంస్థను స్థాపించడానికి భవిష్యత్తులో కొన్ని పెట్టుబడులు పెడుతుందని మరొక నివేదిక పేర్కొంది.