బడ్జెట్ ధరలో LG తీసుకొచ్చిన W సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ మొదలయ్యింది

బడ్జెట్ ధరలో LG తీసుకొచ్చిన W సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ మొదలయ్యింది
HIGHLIGHTS

ఈ ఫోన్ల యొక్క మొదటి సేల్ మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా నుండి జరగనుంది.

LG సంస్థ, తన W సిరిస్ నుండి LG W10 మరియు LG W30 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. అలాగే, మరొక Pro వేరియంట్ అయినటువంటి  W30 Pro కూడా త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్లు డ్యూయల్ కెమేరాలు, ట్రిపుల్ కెమేరాలు మరియు రెగ్యులర్ నోచ్ మరియు డాట్ నాచ్ వంటి ప్రత్యేకతలతో లాంచ్ చేయబడ్డాయి.

LG ఎలక్టానిక్స్ సంస్థ, ఇండియాలోతన సరికొత్త W సిరిస్ ద్వారా అతితక్కువ ప్రారంభదరతో బెస్ట్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త W సిరిస్ స్మార్ట్ ఫోన్లు డ్యూయల్ మరియు ట్రిపుల్ కెమేరాలతో ఆకట్టుకుంటాయి.  ఈ ఫోన్ల యొక్క మొదటి సేల్ మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా నుండి  జరగనుంది.

LG W సిరిస్ స్మార్ట్ ఫోన్ ధరలు

LG W10 ( 3GB + 32GB ) ధర – Rs. 8,999

LG W30 ( 3GB + 32GB ) ధర – Rs. 9,999

LG W10 & LG W30 ప్రత్యేకతలు

ఈ LG W లో ప్రారంభ ఫోన్ అయినటువంటి LG W10 స్మార్ట్ ఫోన్ ఒక 6.19 అంగుళాల HD+ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్, ఒక 18.9:9 ఆస్పెక్టు రేషియో కలిగిన సాధారణ నోచ్ డిస్ప్లే తో అందుతుంది. అయితే, LG W30 మాత్రం ఒక 6.26 అంగుళాల IPS HD+ డాట్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 86% స్క్రీన్ టూ బాడీ రేషియాతో ఉంటుంది. ఇక రెండు స్మార్ట్ ఫోనులు కూడా మీడియాటెక్ హీలియో P22 ఆక్టా కోర్ ప్రాసెసర్ సక్తో పనిచేస్తాయి. అలాగే ఈ ప్రొసెసరుకు జతగా 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజిని అందించింది. అంతేకాకుండా, ఈ రెండు ఫోనులు కూడా ఒక పెద్ద 4,000 mAh బ్యాటరీ శక్తితో అందించబడ్డాయి.

ఇక కెమేరా విభాగానికి వస్తే, LG W10 స్మార్ట్ ఫోన్ 13MP సెన్సారుకు జతగా మరొక 5MP కెమేరా కలిగినటువంటి డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తే, LG W30 స్మార్ట్ ఫోన్ మాత్రం 12MP +13MP+2MP ట్రిపుల్ రియర్ కెమేరాతో వస్తుంది. ఇందులోని, 12MP  సెన్సార్ లో లైట్ సెన్సార్ కాగా, 13MP అల్ట్రా వైడ్ కెమెరాగా 2MP డెప్త్ సెన్సింగ్ కెమెరాగా పనిచేస్తాయి. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే,  LG W10 స్మార్ట్ ఫోనులో 8MP సెల్ఫీ కెమెరాని అందించగా,LG W30 స్మార్ట్ ఫోనులో 16MP సెల్ఫీ కెమేరాని అందించారు.

ఈ రెండు ఫోనులు కూడా ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగి ఉంటాయి. LG W10 తులిప్ పర్పల్ మరియు స్మోకీ గ్రెయ్ వంటి కలర్ ఎంపికలతో వస్తుండగా, LG W30  ఫోన్ మాత్రం అరోరా గ్రీన్, ప్లాటినం గ్రే మరియు థండర్ బ్లూ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది.   ఈ రెండు ఫోన్లు కూడా Android 9 Pie OS పైన నడుస్తాయి.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo