హాట్ హాట్ గా అమ్ముడైన LG W సిరిస్ ఫోన్స్: మొదటి సెల్ 12 నిముషాల్లోనే ఖతం
నమ్మకమైన బ్రాండ్ వాల్యూ మరియు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు.
నిన్న జరిగిన LG W సిరిస్ మొదటి సెల్లో కేవలం 12 నిముషాల్లోనే అన్ని యూనిట్లు హాట్ హాట్ గా అమ్ముడైనట్లు, LG ఇండియా ప్రకటించింది. ఇప్పటి వరకూ, ఇండియాలో ప్రీమియం ఫోన్లను మాత్రమే తీసుకొచ్చినటువంటి LG, ఈ W సిరీస్ ద్వారా గొప్ప కెమేరాలు మరియు మంచి స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం 8,999 ప్రారంభ ధరతో తీసుకువచ్చింది. నమ్మకమైన బ్రాండ్ వాల్యూ మరియు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు, అంతేకాకుండా గొప్ప స్పెక్స్, అన్ని వెరసి ఈ ఫోన్లు గొప్పగా అమ్ముడయ్యాయి.
SurveyLG W సిరిస్ స్మార్ట్ ఫోన్ ధరలు
LG W10 ( 3GB + 32GB ) ధర – Rs. 8,999
LG W30 ( 3GB + 32GB ) ధర – Rs. 9,999
LG W10 & LG W30 ప్రత్యేకతలు
ఈ LG W లో ప్రారంభ ఫోన్ అయినటువంటి LG W10 స్మార్ట్ ఫోన్ ఒక 6.19 అంగుళాల HD+ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్, ఒక 18.9:9 ఆస్పెక్టు రేషియో కలిగిన సాధారణ నోచ్ డిస్ప్లే తో అందుతుంది. అయితే, LG W30 మాత్రం ఒక 6.26 అంగుళాల IPS HD+ డాట్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 86% స్క్రీన్ టూ బాడీ రేషియాతో ఉంటుంది. ఇక రెండు స్మార్ట్ ఫోనులు కూడా మీడియాటెక్ హీలియో P22 ఆక్టా కోర్ ప్రాసెసర్ సక్తో పనిచేస్తాయి. అలాగే ఈ ప్రొసెసరుకు జతగా 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజిని అందించింది. అంతేకాకుండా, ఈ రెండు ఫోనులు కూడా ఒక పెద్ద 4,000 mAh బ్యాటరీ శక్తితో అందించబడ్డాయి.
ఇక కెమేరా విభాగానికి వస్తే, LG W10 స్మార్ట్ ఫోన్ 13MP సెన్సారుకు జతగా మరొక 5MP కెమేరా కలిగినటువంటి డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తే, LG W30 స్మార్ట్ ఫోన్ మాత్రం 12MP +13MP+2MP ట్రిపుల్ రియర్ కెమేరాతో వస్తుంది. ఇందులోని, 12MP సెన్సార్ లో లైట్ సెన్సార్ కాగా, 13MP అల్ట్రా వైడ్ కెమెరాగా 2MP డెప్త్ సెన్సింగ్ కెమెరాగా పనిచేస్తాయి. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, LG W10 స్మార్ట్ ఫోనులో 8MP సెల్ఫీ కెమెరాని అందించగా,LG W30 స్మార్ట్ ఫోనులో 16MP సెల్ఫీ కెమేరాని అందించారు.
ఈ రెండు ఫోనులు కూడా ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగి ఉంటాయి. LG W10 తులిప్ పర్పల్ మరియు స్మోకీ గ్రెయ్ వంటి కలర్ ఎంపికలతో వస్తుండగా, LG W30 ఫోన్ మాత్రం అరోరా గ్రీన్, ప్లాటినం గ్రే మరియు థండర్ బ్లూ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా Android 9 Pie OS పైన నడుస్తాయి.