Lava Pulse: హార్ట్ రేట్ మరియు BP సెన్సార్ తో వచ్చిన మొట్ట మొదటి ఫోన్

Lava Pulse: హార్ట్ రేట్ మరియు BP సెన్సార్ తో వచ్చిన మొట్ట మొదటి ఫోన్
HIGHLIGHTS

Lava Pulse పేరుతొ భారత మొబైల్ తయారీ కంపెనీ లావా, హార్ట్ రేటు మరియు రక్తపోటు సెన్సార్ కలిగిన మొబైల్ ని ఇండియాలో విడుదల చేసింది.

మనం గర్వించ తగిన విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఈ విధంగా తీసుకురాబడిన మొట్ట మొదటి ఫోన్ ఇదే అవుతుంది.

ఈ లావా పల్స్ ఫోన్ ధర కూడా కేవలం 1,500 రూపాయలు మాత్రమే.

Lava Pulse పేరుతొ భారత మొబైల్ తయారీ కంపెనీ లావా, హార్ట్ రేటు మరియు రక్తపోటు సెన్సార్ కలిగిన మొబైల్ ని ఇండియాలో విడుదల చేసింది. మనం గర్వించ తగిన విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఈ విధంగా తీసుకురాబడిన మొట్ట మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఈ లావా పల్స్  ఫోన్ ధర కూడా కేవలం 1,500 రూపాయలు మాత్రమే. ఈ ఫోన్, అమెజాన్, ఫ్లిప్ ‌కార్ట్ మరియు మన దేశంలోని 100,000 రిటైల్ దుకాణాల్లో లభిస్తుంది. ఈ ఫీచర్ ‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు తమ వేలిముద్రను ‘పల్స్ స్కానర్‌’లో ఉంచాలి, అటు తరువాత ఈ ఫోన్ రక్తపోటు మరియు హృదయ స్పందన రేటును స్క్రీన్ పైన చూపిస్తుంది.

భారతీయ మొబైల్ హ్యాండ్ ‌సెట్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తీసుకోతీసుకొచ్చిన ఈ లేటెస్ట్ ఫీచర్ ఫోన్ Lava Puls, హృదయ స్పందన రేటు & రక్తపోటు సెన్సార్ కలిగి ఉన్న మొట్టమొదటి ఫోన్. ఈ ప్రత్యేక ఫీచర్ వినియోగదారులు వారి గుండె ఆరోగ్యాన్ని కేవలం సెకన్లలో కొలవడానికి అనుమతిస్తుంది. వినియోగదారుడు వారి వేలిముద్రను ‘పల్స్ స్కానర్’ పై ఉంచిన వెంటనే, అది వారి రక్తపోటు మరియు హృదయ స్పందన రేటును స్క్రీన్స్ పైన ప్రదర్శిస్తుంది.

భవిష్యత్ రిఫరెన్స్ కోసం యూజర్లు తమ ఫోన్లలో ఈ డేటాను సేవ్ చేయడానికి మరియు మెసేజ్ ద్వారా ఇతరులతో పంచుకునే అవకాశం కూడా ఉంది. ఈ రకమైన గొప్ప ప్రత్యేకతతో వస్తున్న ఈ ఫీచర్ ఫోన్ కూడా అంత ఎక్కువేమీకాదు. ఇది కేవలం రూ. 1599 ధరతో విడుదల చెయ్యబడింది మరియు అద్భుతమైన రోజ్ గోల్డ్ రంగులో వస్తుంది.

Lava Pulse: ఫీచర్స్

Lava Pulse ఒక 2.4 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది మరియు స్టీరియో సౌండ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ధృడ నిర్మాణం గల పాలికార్బోనేట్ బాడీని కలిగి ఉంది మరియు 32 జిబి వరకు విస్తరించదగిన మెమరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్ ‌సెట్ సూపర్ బ్యాటరీ మోడ్‌తో సపోర్ట్ చేయబడిన 1800 mAh బ్యాటరీతో పొందుపరచబడింది, ఇది ఒకే ఛార్జ్‌లో 6 రోజుల వరకు ఉంటుంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్, అంటే ఫోన్ చిన్న చిన్న తాకిడిలను ఎత్తుకునే శక్తితో వస్తుంది. అదనంగా, ఈ ఫోన్ 1 సంవత్సరం రీ ప్లేస్మెంట్ సర్వీస్ వాగ్దానంతో వస్తుంది.

ఈ లావా పల్స్ నంబర్ టాకర్, కాంటాక్ట్  సేవ్ చేయడానికి ఫోటో చిహ్నాలు, రికార్డింగ్ ‌తో వైర్ ‌లెస్ ఎఫ్ఎమ్ మరియు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో సహా ఇతర ఆసక్తికరమైన ఫీచర్లతో కూడి ఉంటుంది. ఈ ఫోన్ ఆటో కాల్ రికార్డింగ్ యొక్క సదుపాయాన్ని అందిస్తుంది మరియు ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, గుజరాతీ మరియు పంజాబీలతో సహా 7 భాషలలో టైప్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo