Lava నుండి చాలా తక్కువ ధరలోనే మేడ్ ఇన్ ఇండియా ఫోన్ వచ్చేసింది

Lava నుండి చాలా తక్కువ ధరలోనే మేడ్ ఇన్ ఇండియా ఫోన్ వచ్చేసింది
HIGHLIGHTS

భారతదేశంలో, LAVA తన కొత్త స్మార్ట్ ‌ఫోన్ ‌విడుదల చేసింది.

Lava Z66 అని పిలువబడే ఈ స్మార్ట్ ‌ఫోన్ ధర మాత్రం బడ్జెట్ ప్రియులకు సరిపడే విధంగానే అందించింది

ఈ ఫోన్ 6.08 అంగుళాల హెచ్‌డి + డిస్ప్లేను ప్యాక్ చేస్తుంది.

భారతదేశంలో, LAVA తన కొత్త స్మార్ట్ ‌ఫోన్ ‌విడుదల చేసింది. Lava Z66 అని పిలువబడే ఈ స్మార్ట్ ‌ఫోన్ ధరను మాత్రం బడ్జెట్ ప్రియులకు సరిపడే విధంగానే అందించింది. ఈ ఫోన్ 6.08 అంగుళాల హెచ్‌డి + డిస్ప్లేను ప్యాక్ చేస్తుంది. ఇది ఒక 1.6Ghz ఆక్టా కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. వెనుకవైపు 13MP + 5MP కాన్ఫిగరేషన్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండగా, ముందు భాగంలో 13MP యూనిట్ ఉంటుంది.

Lava Z66 ప్రత్యేకతలు

భారతీయ మొబైల్ హ్యాండ్‌సెట్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన కొత్త స్మార్ట్ ఫోన్ Lava Z66 ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ‌ఫోన్ 1.6 GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 2.5 డి కర్వ్డ్  స్క్రీన్ & 19: 9 ఎస్పెక్ట్ రేషియోతో ఒక 6.08-అంగుళాల హెచ్‌డి + నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ 3GB ర్యామ్ కి జతగా 32GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ధర రూ. 7777 ధరతో విడుదల చెయ్యబడింది.

ఈ Lava Z66 లో 13MP సెల్ఫీ కెమెరాను స్క్రీన్ ఫ్లాష్‌ తో తీసుకోంచింది. కాబట్టి, తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన పోర్ట్రెయిట్‌ లను తీసేవీలుంటుంది. ఇది 13MP + 5MP  డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను LED ఫ్లాష్ ‌తో కలిగి ఉంది. ఇది అత్యుత్తమ ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది.

వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా బ్యూటీ మోడ్, నైట్ మోడ్, HDR మోడ్, బరస్ట్ మోడ్, పనోరమా, టైమ్ లాప్స్, స్లో మోషన్ మరియు ప్రతి మూడ్ కోసం అదనపు ఫిల్టర్లతో మొత్తంగా ప్రీమియం ఫీచర్లతో నిండి ఉంది.

 లావా జెడ్ 66 ప్రస్తుతం మూడు అద్భుతమైన కలర్ వేరియంట్లలో లభిస్తుంది – మెరైన్ బ్లూ, బెర్రీ రెడ్ మరియు మిడ్నైట్ బ్లూ. ముఖ్యంగా, ఈ స్మార్ట్ ఫోన్ "మేడ్ ఇన్ ఇండియా" స్మార్ట్ ‌ఫోన్మరియు ఆఫ్ ‌లైన్ స్టోర్స్‌ లో లభిస్తుంది మరియు త్వరలో అమెజాన్ మరియు ఫ్లిప్‌ కార్ట్ల లో కూడా లభిస్తుంది.

లావా Z66 ఒక 3950 mAh బ్యాటరీ తో వస్తుంది మరియు ఇది 16 గంటల టాక్ టైంను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ (ఆండ్రాయిడ్ 10) పై నడుస్తుంది మరియు ప్రీ-లోడెడ్ బ్లోట్వేర్ నుండి మాత్రం విముక్తుల్ని చేస్తుంది. ఇది సున్నితమైన పనితీరును మరియు శుభ్రమైన ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది. మెరుగైన  భద్రత కోసం, లావా Z66 లో వేలిముద్ర స్కానర్ మరియు ఫేస్-అన్ ‌లాక్ ఫీచర్‌ను కలిగి ఉంది, ఇది ఫోన్‌ను కేవలం 0.6 సెకన్లలో అన్ ‌లాక్ చేస్తుంది.

లావా జెడ్ 66 డ్యూయల్ సిమ్ సపోర్ట్ (4 జి + 4 జి), బ్లూటూత్ వి 4.2, OTG  సపోర్ట్, మైక్రో-యుఎస్‌బి మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో వస్తుంది. ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ ఉన్న సెన్సార్ల శ్రేణి కూడా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo