Lava Storm Lite 5G: లావా బడ్జెట్ 5G ఫోన్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

Updated on 18-Jun-2025
HIGHLIGHTS

Lava Storm Lite 5G రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది

లావా లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్

ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 8 వేల రూపాయల ఉప బడ్జెట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ విడుదల చేసింది

Lava Storm Lite 5G: లావా లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లావా స్టోర్మ్ లైట్ 5జి రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. లావా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 8 వేల రూపాయల ఉప బడ్జెట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కంటే ముందు ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పోరుతో వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Lava Storm Lite 5G: ప్రైస్

లావా స్టార్మ్ లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ప్రైస్ కేవలం లిమిటెడ్ స్టాక్స్ పై మాత్రమే వర్తిస్తుందని లావా తెలిపింది. అయితే, ఫాస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ ఈ లాంచ్ ఆఫర్ ధరకు అందుకునే అవకాశం అందించారు. ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: బిగ్ డిస్కౌంట్ తో రూ. 4,950ధరలో 350W 5.1 ఛానల్ Soundbar అందుకోండి.!

Lava Storm Lite 5G: ఫీచర్స్

లావా ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6400 5G చిప్ సెట్, 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ తో అందించింది. అంటే, ఈ ఫోన్ లేటెస్ట్ 5జి చిప్ సెట్ మరియు 8GB వరకు ర్యామ్ ఫీచర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 128GB స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లో 6.75 ఇంచ్ HD+ స్క్రీన్ ఉంటుంది మరియు ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది.

లావా స్టోర్మ్ లైట్ 5జి స్మార్ట్ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో Sony 50MP ప్రధాన కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ చాలా కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 14W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అన్ని లావా ఫోన్స్ మాదిరిగానే ఈ ఫోన్ పై కూడా హోమ్ రిపేర్ సర్వీస్ ని ఆఫర్ చేస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :