LAVA Bold N2 Pro launched with 50mp triple camera and big storage
LAVA Bold N2 Pro: లావా తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ ఎన్ 2 ప్రో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను 50MP ట్రిపుల్ కెమెరా మరియు బిగ్ స్టోరేజ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అందించిన లావా బోల్డ్ ఎన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను కొత్తగా ఈ లిస్ట్ లో జత చేసింది.
లావా ఈ ఫోన్ ను కేవలం రూ. 7,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్కెట్లో సేల్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ అరోరా గోల్డ్ మరియు ఎక్లిప్స్ గ్రే రెండు రంగుళ్ళూ లభిస్తుంది.
లావా బోల్డ్ ఎన్ 2 ప్రో స్లీక్ డిజైన్ మరియు 201 గ్రాముల బరువుతో మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ LCD డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ లావా లేటెస్ట్ ఫోన్ Unisoc T7250 ఆక్టాకోర్ చిప్ సెట్, 4 జీబీ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ అంతర్గత స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ లావా ఫోన్ 50MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mah బిగ్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ IP రేటింగ్ విషయానికి వస్తే, లావా బోల్డ్ ఎన్ 2 ప్రో IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: TCL 55 ఇంచ్ QLED Smart Tv అమెజాన్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
ఈ ఫోన్ యాడ్స్ మరియు బ్లోట్ వేర్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ కూడా లావా ఉచిత హోమ్ సర్వీస్ తో వస్తుంది. ఈ లావా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ చవక ధరలో స్లీక్ డిజైన్, స్టన్నింగ్ కెమెరా, బిగ్ బ్యాటరీ మరియు వాటర్ రెసిస్టెంట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ లో లాంచ్ అయినట్లు మనం చెప్పవచ్చు.