Lava Bold N1 : ఈరోజు నుంచి మొదలైన లావా అతి చవక ఫోన్ సేల్.!

Updated on 04-Jun-2025
HIGHLIGHTS

లావా బోల్డ్ N1 మరియు N1 Pro రెండు ఫోన్లు ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి

లావా లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ Lava Bold N1 మరియు N1 Pro

బడ్జెట్ ధరలో ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో లావా లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్స్ ను 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి

Lava Bold N1 : లావా లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లావా బోల్డ్ N1 మరియు N1 Pro రెండు ఫోన్లు ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ ను 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో లావా లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్స్ ధర మరియు ఫీచర్లు ఇక్కడ చూడవచ్చు.

Lava Bold N1 : ప్రైస్

లావా బోల్డ్ ఎన్ 1 స్మార్ట్ ఫోన్ రూ. 5,999 ధరతో మరియు బోల్డ్ ఎన్ 1 ప్రో స్మార్ట్ ఫోన్ రూ. 6,799 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ రెండు ఫోన్లు కూడా ఈరోజు నుంచి అమెజాన్ మరియు లావా వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ ఈ ఫోన్స్ పై మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ లను Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్స్ మరింత చవక ధరలో లభిస్తాయి.

Also Read: Demis Hassabis: కొన్ని ఉద్యోగాలు AI రీప్లేస్ చేయలేవని చెప్పిన గూగుల్ డీప్ మైండ్ CEO

Lava Bold N1 : ఫీచర్స్

లావా బోల్డ్ ఎన్ 1 మరియు ఎన్ 1 ప్రో రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా 6.67 ఇంచ్ HD+ రిజల్యూషన్ స్క్రీన్ కలిగి ఉంటాయి. వీటిలో ఎన్ 1 ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్ తో మరియు ఎన్ 1 ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా Unisoc ఆక్టా కోర్ చిప్ సెట్ తో పని చేస్తాయి. వీటిలో ఎన్ 1 ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటే, ఎన్ 1 ప్రో 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ కూడా వర్చువల్ ర్యామ్ ఫీచర్ కలిగి ఉంటాయి.

కెమెరా పరంగా, లవ్ బోల్డ్ ఎన్ 1 ఫోన్ 13MP AI డ్యూయల్ రియర్ మరియు బోల్డ్ ఎన్ 1 ప్రో ఫోన్ మాత్రం 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఎన్ 1 ఫోన్ 5MP సెల్ఫీ కెమెరా మరియు ఎన్ 1 ప్రో మాత్రం 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటాయి. అలాగే, ఈ రెండు ఫోన్లు కూడా IP 54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :