Lava Blaze Pro: ఆకట్టుకునే డిజైన్, అదిరిపోయే కెమెరాతో లాంచ్.!
Lava Blaze Pro ను లావా విడుదల చేసింది
లావా బ్లేజ్ ప్రో పేరుకు తగ్గట్టుగానే ప్రో ఫీచర్లతో వచ్చింది
ఈ ఫోన్ ను ఆకట్టుకునే డిజైన్ మరియు అదిరిపోయే కెమెరాతో సెటప్ తో లాంచ్ చేసింది
ఇటీవల ఇండియాలో విడుదలై మంచి సక్సస్ సాధించిన లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రో వెర్షన్ ఫోన్ Lava Blaze Pro ను లావా విడుదల చేసింది. లావా బ్లేజ్ ప్రో పేరుకు తగ్గట్టుగానే ప్రో ఫీచర్లతో వచ్చింది. లావా ఈ ఫోన్ ను ఆకట్టుకునే డిజైన్ మరియు అదిరిపోయే కెమెరాతో సెటప్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్లను కలిగివుంది. ఇండియన్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళదామా.
SurveyLava Blaze Pro: ధర తెలుసుకోండి?
ముందుగా Lava Blaze Pro ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ ను లావా రూ.9,999 రూపాయల ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ Flipkart మరియు లావా ఈ స్టోర్ తో పాటుగా రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో వుంది.
Lava Blaze Pro: స్పెక్స్ ఎలా ఉన్నాయి?
లావా బ్లేజ్ ప్రో స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన IPS డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా వుంది మరియు కెమెరా సెటప్ డిజైన్ ప్రీమియం లుక్ తో వుంది. బ్లేజ్ ప్రో మీడియాటెక్ G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అయితే, ఈ ఫోన్ మరింత స్పీడ్ గా పనిచేసినందుకు వీలుగా ఈ ఫోన్ లో 3GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ను కూడా అందించినట్లు లావా తెలిపింది. ఈ ఫోన్ 32GB ఇంటర్నల్ మెమొరీతో వస్తుంది మరియు మెమొరీ కార్డ్ ద్వారా 256GB వరకూ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.
ఇక ఈ ఫోన్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, Lava Blaze Pro వెనుక AI ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మెయిన్ కెమెరా వుంది మరియు ఈ కెమెరా 6X జూమ్ వరకూ సపోర్ట్ చేస్తుందని కూడా లావా పేర్కొంది. సెల్ఫీల కోసం, ముందు ఉన్న వాటర్ డ్రాప్ నోచ్ లో 8MP కెమెరాని స్క్రీన్ ప్లాష్ తో ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile