కేవలం రూ.11,499 ధరకే 6GB ర్యామ్ 5G స్మార్ట్ ఫోన్ అందుకోండి.!

HIGHLIGHTS

చాలా చవక ధరకే బిగ్ ర్యామ్ కలిగిన 5G స్మార్ట్ ఫోన్

ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లతో పాటుగా పూర్తి వివరాలు తెలుసుకోండి

కేవలం రూ.11,499 ధరకే 6GB ర్యామ్ 5G స్మార్ట్ ఫోన్ అందుకోండి.!

చాలా చవక ధరకే బిగ్ ర్యామ్ కలిగిన 5G స్మార్ట్ ఫోన్ ను కొనాలని చూస్తున్నారా? అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఇండియన్ మొబైల్ తయారీ సంస్థ లావా ఇటీవల ఇండియాలో తీసుకొచ్చిన 5G స్మార్ట్ ఫోన్  Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లతో పాటుగా పూర్తి వివరాలు తెలుసుకోండి.!   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Blaze 5G: ధర

Lava Blaze 5G బేసిక్ వేరియంట్ ను రూ.10,499 ధరతో లభిస్తుంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ ధర. అయితే, 6GB ర్యామ్ మరియు 128GB మాత్రం కేవలం రూ.11,499 ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.   

Lava Blaze 5G: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది. ఈ ఫోన్ అన్ని ఇండియన్ బ్యాండ్ 5G లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo