Lava Blaze 2 5G: లార్డ్ ఆఫ్ 5G క్యాప్షన్ తో New ఫోన్ లాంచ్ చేస్తున్న లావా.!
Lava మరొక కొత్త 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది
Lava Blaze 2 5G స్మార్ట్ ఫోన్ ను లార్డ్ ఆఫ్ 5G క్యాప్షన్ తో వస్తోంది
ఈ ఫోన్ లాంచ్ కోసం ఇప్పటికే టీజింగ్ కూడా మొదలు పెట్టింది
భారతీయ మొబైల్ కంపెనీ Lava మరొక కొత్త 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. Lava Blaze 2 5G స్మార్ట్ ఫోన్ ను లార్డ్ ఆఫ్ 5G క్యాప్షన్ తో అక్టోబర్ 2వ తేది మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయడానికి లావా సిద్దమయ్యింది. అంతేకాదు, ఈ లాంఛ్ ఈవెంట్ చూడటానికి రిజిస్ట్రేషన్ లను కూడా ఓపెన్ సోర్స్ లో అందించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇప్పటికే టీజింగ్ కూడా మొదలు పెట్టింది.
SurveyLAVA New Lava Blaze 2 5G:
లావా లాంచ్ చేయబోతున్న ఈ లావా బ్లేజ్ 2 5జి స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ను కంపనీ అందించింది మరియు ట్విట్టర్ ద్వారా ఈ ఫోన్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ రేపు లాంచ్ ఈవెంట్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలువుతుంది మరియు ఈ ఈవెంట్ ను YouTube నుండి Live చూడవచ్చు.

లావా అందించిన ఈ టీజర్ ఇమేజ్ ఈ ఫోన్ సరికొత్త డిజైన్ తో వస్తున్నట్లు మనం చూడవచ్చు. ఈ ఫోన్ లో వెనుక పెద్ద బంప్ ను చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో అందించింది. ఈ బంప్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు ఫ్లాష్ లైట్ ను కలిగి వుంది. కంపెనీ అందించిన టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో కనిపిస్తోంది.
Also Read : Amazon Finale Days: భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తున్న Big Smart Tv డీల్స్.!
అలాగే, ఈ లావా కొత్త ఫోన్ డిజైన్ పరంగా చాలా సన్నగా మరియు క్లీన్ డిజైన్ తో కనిపిస్తోంది మరియు ముందుగా బ్లేజ్ సిరీస్ నుండి వచ్చిన ఫోన్ల కంటే చాలా వినూత్నంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో కుడి పైపు పైన పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉండగా, ఎడమవైపు పైన ములలో SIM ట్రే కనిపిస్తోంది.
అయితే, ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో వస్తుంది మరియు ఇతర ఫీచర్లు మాత్రం ఇంకా వెల్లడించలేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile