Lava AMOLED 2 5G price and features
Lava AMOLED 2 5G: ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు సోనీ కెమెరా వంటి చాలా ఫీచర్స్ తో ఆకట్టుకునే బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. లావా సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
లావా ఈ ఫోన్ ను కేవలం రూ. 13,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం సింగల్ వేరియంట్ తో లాంచ్ అయ్యింది మరియు ఆగస్టు 16వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు అన్ని రిటైల్ స్టోర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్ మరియు ఫెదర్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఈ లావా స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ లావా ఫోన్ ను 500K+ AnTuTu స్కోర్ అందించగల మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 7060 తో అందించింది. ఈ చిప్ సెట్ కి జతగా 6GB LPDDR5 ఫిజికల్ ర్యామ్, 6 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది.
ఈ ఫోన్ కెమెరా పరంగా కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో 50MP (Sony IMX752) ప్రధాన కెమెరా కలిగిన డయల్ రియర్ కెమెరా మరియు ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ HDR ఫోటోలు మరియు వీడియో సపోర్ట్ కలిగి ఉంటుందని లావా తెలిపింది. ఈ లావా ఫోన్ కేవలం 7.55mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. అయితే, ఇంత సన్నని డిజైన్ లో కూడా ఈ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Oppo K13 Turbo 5G: బడ్జెట్ ధరలో సరికొత్త కూలింగ్ ఫ్యాన్ టెక్ తో లాంచ్ అయ్యింది.!
ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 15 OS తో నడుస్తుంది. ఈ ఫోన్ 1 మేజర్ OS అప్డేట్ మరియు 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంది. ఈ లావా ఫోన్ IP 64 రేటింగ్ తో వస్తుంది మరియు డస్ట్ అండ్ వాటర్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ కూడా లావా యొక్క ఉచిత హోమ్ సర్వీస్ ఫీచర్ తో వస్తుంది.