Jio Phone 2 కేవలం రూ.141 రుపాయలకే మీ సొంతం….ఎలాగో తెలుసా?

Updated on 11-Sep-2020
HIGHLIGHTS

Jio Phone తరువాత రిలయన్స్ జియో తీసుకొచ్చిన రెండవ మరియు బెస్ట్ ఫీచర్ ఫోన్ ఈ Jio Phone 2

ఈ ఫోన్, ఫీచర్ అయినా కూడా స్మార్ట్ ఫోనుకు ఏ మాత్రం తీసిపోని విధంగా, మంచి ఫీచర్లతో వస్తుంది.

ఈ Jio Phone 2 4G టెక్నాలజీతో వస్తుంది మరియు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ తో వస్తుంది.

Jio Phone చాలా తక్కువ ధరలో 4G కనక్టివిటీతో వచ్చిన మొదటి ఫీచర్ ఫోన్. తరువాత, రిలయన్స్ జియో తీసుకొచ్చిన రెండవ మరియు బెస్ట్ ఫీచర్ ఫోన్ Jio Phone 2. ఈ జియో ఫోన్ 2, ఫీచర్ ఫోన్ అయినా కూడా ఒక స్మార్ట్ ఫోన్ తో పోటీగా పనిచేయగల సత్తాతో వస్తుంది మరియు స్మార్ట్ ఫోనుకు ఏ మాత్రం తీసిపోని విధంగా వస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ Jio Phone ని కేవలం నెలకు 141 రూపాయల అతి తక్కువ EMI తో మీ సొంతం చేసుకునే అవకాశం కూడా జిఓ అందించింది.    

ఈ Jio Phone 2 4G టెక్నాలజీతో వస్తుంది మరియు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ తో వస్తుంది.            

వాస్తవానికి, ఈ ఫీచర్ ఫోన్ ప్రైస్ రూ. 2,999 రూపాయలు మాత్రమే. అయితే,  నెలకు కేవలం 141 రూపాయల EMI కట్టినా కూడా ఈ ఫోన్ మీ సొంతం చేసుకునే అవకాశాన్ని కూడా జియో అందిస్తోంది. 

Jio Phone 2  ఫీచర్స్

 జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్ కి తగిన వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతు తో వస్తుంది. అంతేకాదు,  ఇందులో 4G VoLTE స్లాట్ లో జియో సిమ్ ని మాత్రమే వాడాల్సి వుంటుంది, దీనితో పాటుగా 2జి స్లాట్ తో ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.

ఈ ఫోన్,  512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, మీకు ఎక్కువ స్టోరేజి అప్షన్ ఇవ్వడం కోసం మైక్రో SD కార్డు స్లాట్ కూడా వుంది,  దీనితో  128జీబీ వరకు స్టోరేజి విస్తరించే వీలుంది. . జియో ఫోన్ మాదిరిగానే, జియో ఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2MP  రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది.    

Jio Phone 2 Plans

రిలయన్స్ జీయో నుంచి ఈ జియో ఫోన్ మరియు జియో ఫోన్ 2 పైన మంచి ప్లాన్స్ ప్రకటించింది. వీటిలో, రూ . 49 ప్లాన్ వినియోగదారులకు 1జీబీ  డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, జియో నుండి జియో కి ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ (నాన్ జియో మినిట్స్ ) మరియు జీయో యాప్స్ 28 రోజులు చెల్లబాటునిస్తుంది. అలాగే, రూ .99 ప్లాన్, 14 జీబి డేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, నాన్ జియో కాలింగ్ మినిట్స్,  జీయో యాక్సెస్ కి 28 రోజులు అందుబాటులో ఉంటుంది.

చివరగా, జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్  కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటుతో వస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :