Jio Phone వినియోగదారులకు UPI ఆధారిత Jio Pay ఫీచర్ ను స్వీకరిస్తునట్లు, ఇంటర్నెట్ లో విస్తృతంగా వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతానికి Jio Pay కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని మరియు ఒక సంవత్సర కాలంగా టెస్టింగ్ లో ఉందని ఒక నివేదిక పేర్కొంది. 2017 లో ప్రారంభించిన జియో ఫోన్ NFC తీసుకువచ్చింది మరియు ఈ ఫీచర్ ఫోన్ లో యాజమాన్య చెల్లింపులను ప్రారంభించడానికి, జియో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో కలిసి పనిచేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2017 లో, జియో ఫోన్ లో NFC ఎనేబుల్ చేసిన పేమెంట్ ఎక్స్ పీరియన్స్ చెయ్యడానికి డిజిట్ కు అవకాశం లభించింది. ప్రయాణానికి పేమెంట్ చేయడానికి ఒక వినియోగదారు తన ఫోన్ ను ఉపయోగించడం ద్వారా బస్సు టికెట్‌ను ఎలా కొనుగోలు చేయవచ్చో జియో మాకు డెమో చూపించింది. ఇందులో, లావాదేవీని పూర్తి చేయడానికి NFC ఉపయోగించబడింది.
జియో ఫోన్ లో UPI ఆధారిత Jio Pay తో వినియోగదారులు ట్యాప్ & పే, డబ్బు పంపడం మరియు స్వీకరించడం, రీఛార్జ్ చేయడం మరియు వంటి మరిన్ని లావాదేవీలను నిర్వహించగలుగుతారు. BGR ఇండియా ప్రకారం, “జియో ఫోన్ కోసం జియో పే టోకనైజేషన్ ప్లాట్ ఫామ్ పై నిర్మించబడింది మరియు ఇది ఏదైనా NFC ఎనేబుల్ చేసిన POS మెషీన్లో ఎన్ఎఫ్సి ద్వారా ‘Tap and Pay’ కాంటాక్ట్‌లెస్ చెల్లింపును ఉపయోగిస్తుంది.
"ప్రస్తుతానికి జియో లో ఆన్ బోర్డ్ Axis, ICICI, HDFC, Standard Chartered, IndusInd, SBI, Kotak, YesBank, RBL Bank వంటి ప్రముఖ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంకుల క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు (మాస్టర్ కార్డ్ మరియు Visa) రెండింటినీ టోకనైజ్ చేసి చెల్లింపు కోసం ఉపయోగించవచ్చని కూడా చెప్పబడింది. ”