iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ ధర తగ్గించిన కంపెనీ…!

iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ ధర తగ్గించిన కంపెనీ…!
HIGHLIGHTS

త్త ఫోన్ రాకతో iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ యొక్క ధరలో మార్పు

1,000 రూపాయల తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో సేల్

iQOO Z7 5G లాంచ్ తరువాత తగ్గిన iQOO Z6 5G ధర

iQOO తన Z సిరీస్ నుండి లేటెస్ట్ 5G ఫోన్ iQOO Z7 5G ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త ఫోన్ రాకతో దేనికి ముందుగా వచ్చిన iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ యొక్క ధరలో మార్పును చేసింది. కంపెనీ ఇప్పుడు iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ ను 1,000 రూపాయల తగ్గింపుతో మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన అందించిన డిస్కౌంట్ మరియు డీల్స్ ఏమిటో చూద్దామా.                 

iQOO Z6: ధర మరియు ఆఫర్లు  

ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ముందుగా రూ.15,499 ధరతో ఉండగా, ఇప్పుడు రూ.1,000 తగ్గింపుతో రూ.14,499 రూపాయలకు లభిస్తోంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. ఈ ఫోన్ ను OneCard క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,000 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది. Buy From Here

ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను ఛార్జర్ లేకుండా కొనాలనుకుంటే కేవలం రూ.13,999 రూపాయలకే కొనుగోలు చేయ్యవచ్చు.       

iQOO Z6: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ 6 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 1445 mm² 5-లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా  2MP మ్యాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo