iQOO Z10 Lite 5G: ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ మొదలు.!

Updated on 25-Jun-2025
HIGHLIGHTS

ఐకూ జెడ్ 10 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ సందర్భంగా ఈ ఆఫర్ ను ఐకూ ప్రకటించింది

ఈ ఒక్కరోజు లభిస్తున్న బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత చవక ధరకు కూడా లభిస్తుంది

iQOO Z10 Lite 5G: ఐకూ సరికొత్తగా విడుదల చేసిన బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఐకూ జెడ్ 10 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ సందర్భంగా ఈ ఆఫర్ ను ఐకూ ప్రకటించింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో 5జి చిప్ సెట్, బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్ట్ మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో రావడమే కాకుండా ఈ ఒక్కరోజు లభిస్తున్న బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత చవక ధరకు కూడా లభిస్తుంది.

iQOO Z10 Lite 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్

ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ లాంచ్ ప్రైస్ క్రింద చూడవచ్చు.

4 జీబీ RAM + 128 జీబీ వేరియంట్ ప్రైస్ : రూ. 9,999

6 జీబీ RAM + 128 జీబీ వేరియంట్ ప్రైస్ : రూ. 10,999

8 జీబీ RAM + 256 జీబీ వేరియంట్ ప్రైస్ : రూ. 12,999

iQOO Z10 Lite

ఆఫర్ :

ఈ స్మార్ట్ ఫోన్ పై ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్ ఈరోజు అందుబాటులో ఉంది. అదేమిటంటే, ఈ ఫోన్ ను SBI మరియు HDFC కార్డుతో కొనే వారికి రూ. 500 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 9,499 రూపాయల ప్రారంభ రేటుకే లభిస్తుంది. Buy From Here

iQOO Z10 Lite 5G: ఫీచర్స్

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ LCD స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ HD ప్లస్ (1600×720) రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ 6nm చిప్ సెట్ Dimensity 6300 5G తో పని చేస్తుంది. దానికి జతగా ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ Android 15 ఆపరేటింగ్ సిస్టం తో Funtouch OS 15 సాఫ్ట్ వేర్ తో నడుస్తుంది.

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 50 MP Sony ప్రైమరీ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 5 MP సెల్ఫీ కెమెరా లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ అడ్వాన్స్ AI ఎడిటింగ్ టూల్స్ మరియు మంచి సోనీ కెమెరా సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6,000 mAh హెవీ బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ను కూడా ఐకూ ఈ ఫోన్ లో అందించింది.

Also Read: Sony 5.1Ch Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్లు అందుకోండి.!

ఈ ఫోన్ ఎవరికి సరిపోతుంది?

ఇక ఈ ఫోన్ యూసేజ్ విషయానికి వస్తే, అంటే ఎటువంటి యూజర్ కి తగినదిగా ఉంటుందని చూస్తే, ఈ ఫోన్ వీడియో, మోడరేట్ గేమ్స్, సోషల్ మీడియా కోసం ఉపయోగించే యూజర్లకు చక్కగా సరిపోతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :