Sony 5.1Ch Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్లు అందుకోండి.!
Sony 5.1Ch Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు జబర్దస్త్ ఆఫర్స్ అందుకోండి, అంటోంది అమెజాన్ ఇండియా. పవర్ ఫుల్ సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు కలిగిన సోనీ లేటెస్ట్ 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ తో సహా కంప్లీట్ సెటప్ కలిగిన సోనీ సౌండ్ బార్ ని ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరకే అందుకునే అవకాశం అందించింది. అందుకే, ఈ జబర్దస్త్ సౌండ్ బార్ గురించి పూర్తి వివరాలు అందిస్తున్నాను.
SurveySony 5.1Ch Dolby Atmos: ఆఫర్
సోనీ ఇండియాలో విడుదల చేసిన 5.1 ఛానల్ సౌండ్ బార్ Sony HT-S2000 5.1ch సౌండ్ బార్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 41% భారీ డిస్కౌంట్ అందించి రూ. 69,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 5,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఇంతటితో ఈ డీల్స్ పర్వం ముగియలేదండోయ్, ఈ సౌండ్ బార్ పై రూ. 3,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అదెలాగంటే, ఈ సౌండ్ బార్ ను ఏదైనా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ పై ఏకంగా రూ. 8,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సోనీ ప్రీమియం సౌండ్ బార్ రూ. 61,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Sony HT-S2000 5.1ch : ఫీచర్స్
ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ వచ్చే పవర్ ఫుల్ సౌండ్ బార్ మరియు జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు మరియు రెండు బిల్ట్ ఇన్ సబ్ ఉఫర్ కలిగిన బార్, SA-RS3S డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ భారీ ఉఫర్ స్పీకర్ కలిగిన SA-SW3 వైర్లెస్ సబ్ ఉఫర్ తో కూడా వస్తుంది.

ఈ సోనీ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ తో సినిమా థియేటర్ ని మరిపించే సూపర్ సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో HDMI eARC, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Samsung Galaxy M36 5G: అంచనా ప్రైస్ మరియు ఫీచర్లు లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!
ఈ సోని సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.7 స్టార్ రేటింగ్ మరియు గొప్ప రివ్యూలను అందుకుంది. ప్రీమియం సౌండ్ కోరుకునే యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile