స్వతంత్ర బ్రాండ్ గా అవతరించిన IQOO

HIGHLIGHTS

ము దాని అధికారిక వెబ్‌ సైట్‌ను కూడా మేము చూశాము.

వివో యొక్క సబ్-బ్రాండ్ IQOO నుండి చాలా స్మార్ట్‌ ఫోన్లు భారతదేశంలోని ఇతర మార్కెట్లలో ప్రారంభించబడ్డాయి. అయితే, ఇప్పుడు డిజిట్ ఈ కంపెనీ ఒక స్వతంత్ర బ్రాండ్ గా అవతరించనున్నట్లు తెలుసుకుంది.  IQOO తో దగ్గరి సంబంధం ఉన్న కొన్ని మూలాల నుండి ఐక్యూ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్త మార్కెట్లలో ప్రత్యేక బ్రాండ్‌గా అడుగులు వేయబోతున్నట్లు, డిజిట్‌ తో చెప్పారు. దీని అర్థం ఇది వివో ఎటువంటి అనుబంధం లేకుండా సాగుతుంది. ఇప్పటివరకు మనం iQOO వివో యొక్క ఉప బ్రాండ్ అని అనుకున్నాము కాని ఇప్పుడు ఇది ఒక సొంత బ్రాండ్ గా బయటకు వస్తోంది.

మనం  గత కొన్ని సంవత్సరాలుగా ఉప బ్రాండ్లను పెద్ద ఎత్తున చూశాము. షావోమి యొక్క ఉప బ్రాండ్‌ గా POCO ను చూశాము. ఇది కాకుండా, షావోమితో పాటు రెడ్మి మరియు పోకోలను ప్రత్యేక బ్రాండ్‌ గా కూడా చూశాము. ఇక ఒప్పో నుండి బయటకువచ్చి సొంత బ్రాండ్ గా మారిన  Realme ని కూడా చూశాము. , హువావే హానర్ ను కూడా తన నుండి వేరు చేసింది.

 ఇప్పుడు హానర్ కూడా మార్కెట్లో ప్రత్యేక బ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇక నుండి భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని ఇతర దేశాలలో ఐక్యూను ఒక ప్రత్యేక బ్రాండ్‌ గా చూడబోతున్నాం. మేము దాని అధికారిక వెబ్‌ సైట్‌ను కూడా మేము చూశాము. ఈ వెబ్‌సైట్‌లో ఇంకా సమాచారం అందుబాటులో లేనప్పటికీ, iQOO 'Coming Soon' అని చూపిస్తోంది. మీరు ఈ వెబ్‌సైట్‌ను ఇక్కడ చూడవచ్చు.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :