iQOO Neo 10 sale started with big deals
ఐకూ లేటెస్ట్ గా విడుదల చేసిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ iQOO Neo 10 సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది మరియు ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 29,999 రూపాయల ప్రారంభ ధరకే లభిస్తుంది. ఈ లేటెస్ట్ ఫోన్ సేల్ మరియు ఆఫర్స్ పూర్తిగా తెలుసుకుందామా.
ఈ ఐకూ కొత్త ఫోన్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ నాలుగు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
(8GB RAM, 128GB) వేరియంట్ ధర : రూ. 31,999
(8GB RAM, 256GB) వేరియంట్ ధర : రూ. 33,999
(12GB RAM, 256GB) వేరియంట్ ధర : రూ. 35,999
(16GB RAM, 512GB) వేరియంట్ ధర : రూ. 40,999
ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా మరియు ఐకూ అధికారిక సైట్ నుంచి పొందవచ్చు. ఈ ఫోన్ ఇన్ఫెర్నో రెడ్ మరియు టైటానియం క్రోమ్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ కార్డ్స్ తో రూ. 2,000 డిస్కౌంట్ లేదా రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ వంటి అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Infinix GT 30 Pro: గేమింగ్ సెంట్రిక్ ఫీచర్స్ మరియు సెటప్ తో లాంచ్ అయ్యింది.!
ఈ ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ 2.42 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్ కలిగిన Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 16GB ర్యామ్ మరియు 512GB వారికి స్టోరేజ్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 144 FPS రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన AMOLED ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు డిస్ప్లే కోసం ప్రత్యేకమైన Q1 సూపర్ కంప్యూటింగ్ సెట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 50MP సోనీ OIS ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS తో 4K వీడియో రికార్డింగ్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.