iQOO 15R India launch teased and know expected features
iQOO 15R ఇండియా లాంచ్ గురించి ఐకూ ఇండియాకు CEO (ప్రధాన కార్యనిర్వహణాధికారి) అయిన నిపున్ మార్య (Nipun Marya) టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఫోన్ లాంచ్ గురించి ఆయన తన అఫీషియల్ x అకౌంట్ నుంచి టీజర్ విడుదల చేశారు. ఇందులో ఈ ఫోన్ యొక్క డిజైన్ ను ఆయన వెల్లడించారు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ కూడా ఆన్లైన్ లో దర్శనం ఇచ్చాయి. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ గురించి నాకు తెలిసిన పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతున్నాను.
ఐకూ 15R స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి మాత్రమే నిపున్ మార్య వెల్లడించారు. ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ లేటెస్ట్ Origin OS తో లాంచ్ అవుతుంది. ఈ వివరాలు ఈ ఫోను టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడి అయ్యాయి. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం వుంది.
ఐకూ 15 ఆర్ స్మార్ట్ ఫోన్ కూడా పవర్ ఫుల్ ఫ్లాగ్‌షిప్ లెవెల్ ప్రీమియం ఫోన్ గా రాబోతుందని ఈ ఫోన్ లీక్స్ మరియు అంచనా ఫీచర్స్ తెలియ చేస్తున్నాయి. ఈ ఫోన్ ను 6.59-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే తో లాంచ్ చేస్తుందని కూడా చెబుతున్నారు. అంతేకాదు, ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టమైన బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఐకూ ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Gen 5 తో లాంచ్ చేస్తుంది. దానికి జతగా బిగ్ LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 200 MP ప్రైమరీ కెమెరా జతగా 8 MP అల్ట్రావైడ్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్ లో పెద్ద 7600 mAh బ్యాటరీ ఉంటుంది మరియు 100 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Android 16 ఆధారంగా పనిచేసే Origin OS 6 తో రానుందని అంచనా ఉంది.
Also Read: Samsung లేటెస్ట్ 4K Smart Tv ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తోంది.!
మరి ఈ ఫోన్ ను ఎటువంటి ఫీచర్స్ తో ఐకూ లాంచ్ చేస్తుందో చూడాలి. వాస్తవానికి, ఐకూ రీసెంట్ గా విడుదల చేసిన ఐకూ 15 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ ఫోన్ ను కూడా అదే అంచనాలతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.