Samsung లేటెస్ట్ 4K Smart Tv ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

Samsung లేటెస్ట్ 4K Smart Tv ఈరోజు ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తోంది

ఈరోజు ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ అందించిన డిస్కౌంట్ తో ఈ ధరలో లభిస్తుంది

ఈ టీవీపై అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ అందించింది

Samsung లేటెస్ట్ 4K Smart Tv ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తోంది.!

Samsung లేటెస్ట్ 4K Smart Tv ఈరోజు ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తోంది. శాంసంగ్ గత సంవత్సరం చివరిలో అందించిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ అందించిన డిస్కౌంట్ తో ఈ ధరలో లభిస్తుంది. ఈ సాంసంగ్ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ మరియు మంచి సౌండ్ అందించే సౌండ్ సెటప్ తో పాటు మంచి కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung లేటెస్ట్ 4K Smart Tv : ఆఫర్

శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ సిరీస్ నుంచి ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (UA43UE84AFULXL) పై ఫ్లిప్ కార్ట్ సేల్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 37% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,490 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. అంతేకాదు, ఈ టీవీపై అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ అందించింది.

Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 10,000 డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

Samsung లేటెస్ట్ 4K Smart Tv : ఫీచర్స్

ఈ శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 2025 ఎడిషన్ 4K UHD రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 4K రెజల్యూషన్ (3840 × 2160) తో సూపర్ క్లీర్ మరియు డీటైల్‌ విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Crystal Processor 4K ను ఉపయోగించి తక్కువ రిజల్యూషన్ ఉన్న కంటెంట్‌ను కూడా 4K అప్‌స్కేలింగ్ తో ఎక్కువ క్లారిటీ తో అందిస్తుంది. అలాగే, ఈ టీవీ కలిగిన Pur Color, మెగా కాంట్రాస్ట్ మరియు కలర్ బూస్టర్ వంటి డిస్ప్లే ఫీచర్స్ వల్ల రంగులు మరింత సహజసిద్ధంగా కనిపిస్తాయి. అలాగే, HDR10+ సపోర్ట్‌తో కాంట్రాస్ట్ ఇంకా మెరుగుపడుతుంది.

latest Samsung 4K Smart Tv big deal on flipkart sale

ఈ టీవీ స్మార్ట్ ఫీచర్లతో పాటు Tizen OS తో వస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Alexa మరియు Bixby వాయిస్ అసిస్టెంట్‌ తో వస్తుంది. అలాగే, శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా 100+ ఉచిత ఛానల్స్ ను కూడా ఈ టీవిలో మీరు యాక్సెస్‌ చేయవచ్చు. ఈ టీవిలో Wi-Fi 5, బ్లూటూత్ 5.2, 3 HDMI పోర్ట్‌లు (eARC), 1 USB పోర్ట్ మరియు LAN పోర్టు వంటి కనెక్టివిటీ సపోర్ట్ లతో కూడా ఉన్నాయి. ఈ టీవీ 20 W ఆడియో అవుట్పుట్ అందిస్తుంది. ఇందులో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, అడాప్టివ్ సౌండ్, Q-Symphony వంటి ఆడియో టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo