ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. 2026 భారత రిపబ్లిక్ డే సందర్భంగా తీసుకొచ్చిన లేటెస్ట్ సేల్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. అమెజాన్ సేల్ అందించిన ఈ బిగ్ డీల్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు చాలా మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్
జెబ్రోనిక్స్ యొక్క 7.2.4 సౌండ్ బార్ మోడల్ Juke BAR 10000 పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ సేల్ కు మందు రూ. 44,999 రూపాయల ప్రైస్ తో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి అందించిన రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 34,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై SBI క్రెడిట్ కార్డు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 33,499 రూపాయల ఆఫర్ ధరలో మీకు అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. Buy From Here
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.2.4 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో ముందు మూడు స్పీకర్లు, పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు సైడ్ లో రెండు స్పీకర్లు కలిగిన సూపర్ సరౌండ్ బార్ ఉంటుంది. దీనితో పాటు ఇందులో ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన సూపర్ సరౌండ్ శాటిలైట్ స్పీకర్లు మరియు గ్రౌండ్ షేకింగ్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 1100W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అదనంగా, ఈ సౌండ్ బార్ ZEB Acousti Max ఫీచర్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ ని మరించే జబర్దస్త్ సరౌండ్ అండ్ లీనమయ్యే 3D సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eARC, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూ అందుకుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మీకు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.