iQOO 13 Launch: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కొత్త టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు కూడా బయటపెట్టింది. ముందుగా చైనా మార్కెట్ లో విడుదల చేసిన ఈ ఫోన్ ను ఇప్పుడు భారత మార్కెట్లో కూడా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ కొత్త టీజర్ ద్వారా బయటకు వచ్చిన కొత్త వివరాలు మరియు ఈ ఫోన్ కీలకమైన స్పెక్స్ తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
iQOO 13 Launch:
ఐకూ 13 స్మార్ట్ ఫోన్ ను ఇదే నెలలో లాంచ్ చేస్తుందని ఐకూ ప్రకటించింది. అంటే, ఈ నెల చివరి నాటికి లేదా అంత కంటే ముందు ఈ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి, ఈ ఫోన్ ను చైనా మార్కెట్ లో ముందే విడుదల చేసింది. ఈ ఫోన్ గొప్ప డిజైన్ తో లాంచ్ చేస్తోంది మరియు ఇందులో BMW స్పెషల్ ఎడిషన్ కూడా ఉంటుంది.
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది. అందుకే, అమెజాన్ ప్లాట్ ఫామ్ పై ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ని అందించింది. ఈ టీజింగ్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది.
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Elite సూపర్ ఫాస్ట్ చిప్ సెట్ మరియు జతగా iQOO సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ను కూడా కలిగి ఉంటుందని కన్ఫర్మ్ చేసింది. ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 2K రిజల్యూషన్ కలిగిన LTPO AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుందని కూడా ఐకూ కన్ఫర్మ్ చేసింది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు కెమెరా చూట్టు ఉన్న పెద్ద రింగ్ లైట్ (Monster helo Lite) తో ఉంటుంది. ఈ టైప్ C పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు గొప్ప డిజైన్ ను కలిగి ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ అప్ కమింగ్ ఐకూ ఫోన్ యొక్క మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళి కలుద్దాం.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile