iQOO 13 5G భారీ ఫీచర్స్ తో విడుదలయింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

iQOO 13 5G ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా చైనా మార్కెట్ లో విడుదల చేయబడింది

ఈ ఫోన్ Snapdragon 8 Elite మరియు భారీ కెమెరా సెటప్ వంటి ఫీచర్స్ తో వచ్చింది.

iQOO 13 5G భారీ ఫీచర్స్ తో విడుదలయింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

iQOO 13 5G ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా చైనా మార్కెట్ లో విడుదల చేయబడింది మరియు ఈరోజు ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఫోన్ Snapdragon 8 Elite మరియు భారీ కెమెరా సెటప్ వంటి ఫీచర్స్ తో వచ్చింది. ఈ లేటెస్ట్ ఐకూ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO 13 5G : ప్రైస్ 

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (12GB+256GB) రూ. 54,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ (16GB+512GB) ను రూ. 84,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్  ని ఈరోజు నుంచే ఐకూ ఓపెన్  చేసింది. ఈ ఫోన్ ఫాస్ట్ సేల్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతుంది. 

ఆఫర్స్ : 

ఈ ఫోన్ తో బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లను ఐకూ అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ను వివో లేదా ఐకూ డివైజెస్ తో ఎక్స్ చేంజ్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు బోనస్ లభిస్తుంది. ఈ ఫోన్ తో లిమిటెడ్ పిరియడ్ ప్రీ బుక్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ తో రూ. 3,999 రూపాయల గేమ్ ప్యాడ్ ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది.             

iQOO 13 5G : ఫీచర్స్ 

ఐకూ 13 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite వేగవంతమైన చిప్ సెట్ మరియు Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ తో లాంచ్ అయ్యింది. దీనికి జతగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB (UFS 4.1) ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 లక్షలకు పైగా AnTuTu స్కోర్ తో గొప్ప పెర్ఫార్మన్స్ అందిస్తుందని ఐకూ తెలిపింది.

iQOO 13 5G

ఐకూ 13 స్మార్ట్ ఫోన్ లో 2K రిజల్యూషన్ కలిగిన పెద్ద 6.8 ఇంచ్ AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ మరియు అధిక బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ వేగంగా చల్లబడడానికి వీలుగా పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా వుంది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh సిలికాన్ ఆనోడు బ్యాటరీ వుంది.

Also Read: BSNL : రూ. 400 కంటే తక్కువ ధరలో 150 రోజులు వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్.!

ఇక ఈ ఫోన్ కలిగి ఉన్న కెమెరా సిస్టం విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం వుంది. ఇందులో, 50MP Sony IMX921 మెయిన్, 50 MP అల్ట్రా వైడ్ మరియు 50MP Sony IMX 816 టెలిఫోటో సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాతో కూడా 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ వీడియో షూట్ చేయవచ్చు.                                           

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo