iPhone 18 Pro Max లాంచ్ కంటే ముందే భారీ తగ్గింపు అందుకున్న iPhone 17 Pro Max

HIGHLIGHTS

యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ కంటే ముందే పాత సిరీస్ ప్రీమియం బిగ్ ప్రైస్ కట్ అందుకుంది

ఫ్లాగ్ షిప్ ఫోన్ iPhone 17 Pro Max ఫోన్ భారీ తగ్గింపు అందుకుంది

ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫోన్ ఆఫర్ కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్

యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ కంటే ముందే పాత సిరీస్ ప్రీమియం బిగ్ ప్రైస్ కట్ అందుకుంది. ఏమిటి ఈ తిరకాసు సరిగా చెప్పండి అని అంటున్నారా? కొత్తగా ఏమి లేదండి పైన హెడ్ లైన్ లో చెప్పిన మాటే చెబుతున్నాను. యాపిల్ iPhone 18 Pro Max ఫోన్ ఈరోజు రాత్రి లాంచ్ కావడానికి సిద్ధంగా ఉండగా గత సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్ iPhone 17 Pro Max ఫోన్ భారీ తగ్గింపు అందుకుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫోన్ ఆఫర్ కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అవుతుంది.

iPhone 17 Pro Max: ఆఫర్ అండ్ ప్రైస్

ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,49,900 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ను విజయ్ సేల్స్ అఫీషియల్ సైట్ నుంచి రూ. 5,910 బిగ్ డిస్కౌంట్ తో రూ. 1,43,990 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అవుట్ చేసింది. ఈ డిస్కౌంట్ కాకుండా ఈ ఫోన్ పై సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్ పై రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది.

అంటే, ఈరోజు విజయ్ సేల్స్ నుంచి ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫోన్ ను రూ. 9,910 రూపాయల భారీ తగ్గింపు ధరలో అందుకోవచ్చు. అయితే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ రేట్లు ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే, కొత్త ఫోన్ లాంచ్ తో పాటు పాత ఫోన్స్ ధరలు తగ్గించడం చాలా అనాదిగా వస్తున్న యాపిల్ ఆచారంగా చెబుతారు. అయితే కూడా ఈ రోజు అందుబాటులో ఉన్న ఈ డీల్ కూడా బెస్ట్ డీల్ గా నిలుస్తుంది.

Also Read: iPhone Ultra: విపరీతంగా వైరల్ అవుతున్న కొత్త ఐఫోన్ వీడియోలు.!

iPhone 17 Pro Max: ఫీచర్స్

ఐఫోన్ 17 ప్రో మాక్స్ లో ఫోన్ ని శక్తివంతమైన A19 Pro చిప్‌ తో యాపిల్ అందించింది. అలాగే, మెరుగైన పనితీరు కోసం ఇందులో కొత్త వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ను యాపిల్ ఉపయోగించింది. ఇది ఎక్కువ సేపు గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు చేసినప్పుడు కూడా ఫోన్ వేడిని సమర్థంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ ఫోన్‌ లో 6.9-అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz ప్రో మోషన్, ఆల్ వేస్ ఆన్ డిస్ప్లే మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.

యాపిల్ ఈ ఫోన్ లో మూడు 48MP Fusion కెమెరాలతో కూడిన ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ని అందించింది. ఇది 4x మరియు 8x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ మరియు 120fps 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 18MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఇది ఎక్కువ సమయం నిలిచి ఉండే బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :