Intex కొత్త స్మార్ట్ఫోన్ UDAYభారతదేశం లో లాంచ్ ,ధర రూ .7,999

ఇండియన్ స్మార్ట్ఫోన్ తయారీదారు ఇంటెక్స్ టెక్నాలజీస్ భారత్ లో  తన UDAY స్మార్ట్ఫోన్ ని  ప్రవేశపెట్టింది. ఇది ఒక 4G VoLTE స్మార్ట్ఫోన్ మరియు అది ఒక ఫింగర్ ప్రింట్  సెన్సార్ కూడా ఉంది. ఇంటెక్స్ ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 7,999 మరియు ఈ డివైస్ పై  Jio Rs. 2,200 కాష్బ్యాక్ ఆఫర్లు చాలా ఉన్నాయి.

 

Intex UDAY స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ పై పనిచేస్తుంది. ఈ డివైస్  డ్యూయల్ సిమ్ కు మద్దతు ఇస్తుంది. Intex UDAY యొక్క 1280 x 720 పిక్సల్స్ తో 5.2-అంగుళాల HD డిస్ప్లే కలిగి  ఉంది. అదనంగా, మరియు 1.3GHz క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ ,3GB RAM మరియు 32GB స్టోరేజ్  అమర్చారు, స్టోరేజ్ ని  మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . 

 

మీరు ఆప్టిక్స్ చూస్తే, ఈ స్మార్ట్ఫోన్ 13MP ప్రాధమిక కెమెరాని కలిగి ఉంటుంది, ఇది కాకుండా LED ఫ్లాష్ తో వస్తుంది, 5MP ఫ్రంట్ కెమెరా  ఫ్రంట్ కెమెరా LED ఫ్లాష్ తో  అందిస్తుంది. ఇన్టెక్స్ UDAY స్మార్ట్ఫోన్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 4.2, GPS + GLONASS కు మద్దతు ఇస్తుంది మరియు 2800mAh బ్యాటరీని కలిగి ఉంది.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :