Infinix Zero Flip 5G : ట్రిపుల్ 50MP కెమెరాలతో మిడ్ రేంజ్ లో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ ఈరోజు తన ఫ్లిప్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది

Infinix Zero Flip 5G ను మూడు 50MP కెమెరాలు మరియు గొప్ప డిజైన్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ JBL డ్యూయల్ స్పీకర్లను Hi-Res Audio సపోర్ట్ తో కలిగి ఉంటుంది

Infinix Zero Flip 5G : ఇన్ఫినిక్స్ ఈరోజు తన ఫ్లిప్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫ్లిప్ ఫోన్ ను మూడు 50MP కెమెరాలు మరియు గొప్ప డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ లో భాగంగా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. సరికొత్తగా ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Infinix Zero Flip 5G : ఫీచర్స్

ఇన్ఫినిక్స్ ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను మధ్యకు మడత పెట్టగలిగే 6.9 ఇంచ్ LTPO AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ FHD+ రిజల్యూషన్ మరియు 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ను కలిగి ఉండడంతో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 3.64 ఇంచ్ వెలుపలి సెకండరీ స్క్రీన్ కూడా వుంది. ఈ ఫోన్ Dimensity 8020 5G ప్రోసెసర్, 8GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ JBL డ్యూయల్ స్పీకర్లను Hi-Res Audio సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

ఈ ఫ్లిప్ ఫోన్ లో 50MP + 50MP డ్యూయల్ రియర్ మరియు 50MP ఫ్రెంట్ కెమెరాతో కలిపి మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాతో కూడా 4K వీడియోలు షూట్ చేయవచ్చు. అయితే, సెల్ఫీ కెమెరాతో 4K వీడియోలు 60 fps వద్ద షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ సెల్ఫీ కెమేరాతో 4K వీడియోలు 60fps వద్ద షూట్ చేయవచ్చు.

ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో Infinix AI సపోర్ట్ వుంది. ఈ ఫోన్ లో 4,720 mAh బ్యాటరీ 70W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Also Read: రోజు నుంచి మొదలైన Amazon Diwali Special Sale: అదిరే స్మార్ట్ టీవీ ఆఫర్ కూడా అందించింది.!

Infinix Zero Flip 5G : ప్రైస్

ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ ను రూ. 49,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ \డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 5,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్ Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :