తక్కువ ధరలో 4GB+3GB ర్యామ్ తో వచ్చిన Infinix SMART 7 సేల్ స్టార్ట్ అయ్యింది.!

HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ లేటెస్ట్ బడ్జెట్ బీస్ట్ Infinix SMART 7 సేల్ మొదలయ్యింది

రీసెంట్ గా ఇండియన్ మార్కెట్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుండి సేల్ అవుతోంది

తక్కువ ధరలో 4GB+3GB ర్యామ్ తో వచ్చిన ఫోన్ గా ఈ Infinix SMART 7 గురించి చెప్పవచ్చు

తక్కువ ధరలో 4GB+3GB ర్యామ్ తో వచ్చిన Infinix SMART 7 సేల్ స్టార్ట్ అయ్యింది.!

ఇన్ఫినిక్స్ లేటెస్ట్ బడ్జెట్ బీస్ట్ Infinix SMART 7 సేల్ మొదలయ్యింది. రీసెంట్ గా ఇండియన్ మార్కెట్ లో విడుదలైన  ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుండి సేల్ అవుతోంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ కేటగిరిలో 6000mAh హెవీ బ్యాటరీ కలిగిన ఫోన్ గా నిలుస్తుంది. ఇది మాత్రమే కాదు, తక్కువ ధరలో 4GB+3GB ర్యామ్ తో వచ్చిన ఫోన్ గా  కూడా ఈ Infinix SMART 7 గురించి చెప్పవచ్చు. ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను కొనేముందుగా మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఇక్కడ చూడండి.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix SMART 7: ధర

ఇంఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెషల్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ.7,299 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 26 నుండి Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

Infinix SMART 7: స్పెక్స్ 

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని చిన్న వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc ఆక్టా కోర్ ప్రోసెసర్ Spreadtrum SC9863A1 తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో 3GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ను కూడా ఇన్ఫినిక్స్ అందించడం విశేషం. 

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 లో అఫర్ చేస్తున్న కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 13MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ లో 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ . ఈ ఫోన్ Android 12 OS ఆధారిత XOS 12 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ 6000 mAh హెవీ బ్యాటరీని టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo