కేవలం రూ.7,999 ధరలో గేమింగ్ ప్రాసెసర్ తో ఫోన్ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్..!!

HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

కేవలం రూ.7,999 ధరలో గేమింగ్ ప్రాసెసర్ తో విడుదల

ఈ ఫోన్ 3GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో వస్తుంది

కేవలం రూ.7,999 ధరలో గేమింగ్ ప్రాసెసర్ తో ఫోన్ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్..!!

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ.7,999 ధరలో గేమింగ్ ప్రాసెసర్ తో విడుదల చెయ్యడం విశేషం. అదే, Infinix Smart 6 Plus మరియు ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద డిస్ప్లే,బిగ్ బ్యాటరీ మరియు వర్చువల్ ర్యామ్ వంటి మరిన్ని ఫీచర్లతో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix Smart 6 Plus : ధర మరియు సేల్

Infinix Smart 6 Plus స్మార్ట్ ఫోన్ 3GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో వస్తుంది దీని ధర కేవలం రూ.7,999. ఇది మిరాకిల్ బ్లాక్ మరియు ట్రాంక్విల్ సీ బ్లూ రంగులలో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 3 నుండి Flipkart ద్వారా సేల్ కి వస్తుంది. 

Infinix Smart 6 Plus : స్పెక్స్

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక పెద్ద 6.82 ఇంచ్ HD + డ్రాప్ నాచ్ డిస్ప్లేని 20.5:9 యాస్పెక్స్ట్ రేషియాతో కలిగివుంది. ఈ ఫోన్ 3 జిబి ర్యామ్ మరియు 3GB వరకు వర్చువల్ ర్యామ్ తో పాటుగా 64 జిబి స్టోరేజ్ ‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G25 ఆక్టా కోర్ ప్రాసెసర్ ‌శక్తితో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పైన నడుస్తుంది. ఇది 512GB వరకు మెమరీని పెంచడానికి ప్రత్యేకమైన 3-ఇన్ -1 SD కార్డ్ స్లాట్‌ తో వస్తుంది. 

ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఫోటోలను అందించే కెమెరాతో రూపొందించబడింది. ఇది 8MP AI డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోనులో ఎఫ్ / 2.0 ఎపర్చరుతో 5MP సెల్ఫీ కెమెరా, AI HDR, బ్యూటీ మోడ్ మరియు  పోర్ట్రెయిట్ మరియు వైడ్ సెల్ఫీ వంటి మల్టి కెమెరా మోడ్లు ఉన్నాయి. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo