Infinix Smart 4 Plus కేవలం రూ.7,999 ధరలో 6,000mAh బ్యాటరీతో వచ్చింది

Infinix Smart 4 Plus కేవలం రూ.7,999 ధరలో 6,000mAh బ్యాటరీతో వచ్చింది
HIGHLIGHTS

ఈ Infinix Smart 4 Plus పెద్ద బ్యాటరీతో కేవలం రూ .7,999 రేటుతో ఇండియాలో విడుదల చేసింది

3 జిబి ర్యామ్ / 32 జిబి స్టోరేజ్ ‌తో హీలియో A 25 ఆక్టా కోర్ ప్రాసెసర్ ‌శక్తితో పనిచేసే ఈ సరికొత్త స్మార్ట్ 4 ప్లస్ స్మార్ట్ ‌ఫోన్ ఆండ్రాయిడ్ XOS 6.2 డాల్ఫిన్‌ లో పనిచేస్తుంది.

Infinix Smart 4 Plus జూలై 28 నుండి ఫ్లిప్‌ కార్ట్‌లో కేవలం 7999 / - ధరకు అందుబాటులో వుంటుంది

ఇన్ఫినిక్స్ భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ ఫోన్ ‌ను విడుదల చేసింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను  Infinix Smart 4 Plus పేరుతో మరియు రూ .7,999 రేటుతో ఇండియాలో విడుదల చేసింది మరియు ఈ ఫోన్ జూలై 8 నుండి మార్కెట్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక పెద్ద 6.82-అంగుళాల HD + డిస్ప్లే మరియు మీడియాటెక్ హిలియో A 25 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఇది 13MP డ్యూయల్-రియర్ కెమెరా మరియు భారీ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Infinix Smart 4 Plus స్పెక్స్

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక పెద్ద 6.82 ”HD + డ్రాప్ నాచ్ డిస్ప్లే మరియు 90.3% స్క్రీన్ టు బాడీ రేషియోతో 480 నిట్స్  బ్రైట్నెస్ తో వస్తుంది, ఇది టీవీ షోలను చూడటానికి అద్భుతమైన ఎంపికగా వుంటుంది, సినిమాలు, మ్యూజిక్ వీడియోలు లేదా ఎలాంటి వినోదం కార్యక్రమాలనైనా DTS సరౌండ్ సౌండ్ తో చక్కగా ఆస్వాదించవచ్చు మరియు నాలుగు మోడ్‌ లలో శక్తివంతమైన ఆడియో అనుభవంతో మీ వ్యూవింగ్ అనుభవాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది.

Infinix Smart 4 Plus కెమేరా

ఈ స్మార్ట్ 4 ప్లస్ బడ్జెట్ స్మార్ట్ ‌ఫోన్, కెమేరా విభాగంలో ఉత్తమ కెమెరాను అందించే విధంగా రూపొందించబడింది. ఇది 13MP AI డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది, ఇది ట్రిపుల్ LED ఫ్లాష్‌ తో పాటు f / 1.8 పెద్ద ఎపర్చర్‌ తో ఉంటుంది, ఫోటో ఔత్సాహికులు అతిచిన్న వస్తువులను ఎక్కువ స్పష్టతతో చిత్రించడానికి వీలు కల్పిస్తుంది. ఈ స్మార్ట్ ఫోనులో ఎఫ్ / 2.0 ఎపర్చరుతో 8MP సెల్ఫీ కెమెరా, AI -డ్రైవ్ బ్యూటీ మోడ్ మరియు  ‘పర్ఫెక్ట్’ పిక్చర్ కోసం పోర్ట్రెయిట్ మరియు వైడ్ సెల్ఫీ వంటి మల్టి కెమెరా మోడ్లు ఉన్నాయి.

Infinix Smart 4 Plus బ్యాటరీ

కొత్తగా ప్రారంభించిన స్మార్ట్‌ ఫోన్ ఈ విభాగంలో అత్యాధునిక ఫీచర్లతో నిండి ఉంది, ఇది కేవలం 8 వేల ధర విభాగంలో 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పాటు AI స్మార్ట్ పవర్ సేవింగ్ తో వస్తుంది. ఇది ఈ స్మార్ట్ ఫోనుకు రెండు రోజుల పవర్ ని బ్యాకప్ చేస్తుంది. ఈ పెద్ద బ్యాటరీ, 31 రోజుల స్టాండ్‌బై టైం , 23 గంటల నాన్ ‌స్టాప్ వీడియో ప్లే బ్యాక్, 38 గంటల 4G టాక్‌టైమ్, 44 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్, 23 గంటల వెబ్ సర్ఫింగ్ మరియు 13 గంటల గేమింగ్‌ను అందిస్తుంది.

Infinix Smart 4 Plus పర్ఫార్మెన్స్ , స్టోరేజ్ మరియు డిజైన్

3 జిబి ర్యామ్ / 32 జిబి స్టోరేజ్ ‌తో హీలియో A 25 ఆక్టా కోర్ ప్రాసెసర్ ‌శక్తితో పనిచేసే ఈ సరికొత్త స్మార్ట్ 4 ప్లస్ స్మార్ట్ ‌ఫోన్ ఆండ్రాయిడ్ XOS 6.2 డాల్ఫిన్‌ లో పనిచేస్తుంది. ఇది 256GB వరకు మెమరీని పెంచడానికి ప్రత్యేకమైన 3-ఇన్ -1 SD కార్డ్ స్లాట్‌ తో వస్తుంది. ఇక ప్రీమియం డిజైన్ మరియు అందమైన ఫినిషింగ్ అనుభవం కోసం 2.5 డి కర్వ్డ్ గ్లాస్ యూనిబోడీ ఫినిషింగ్ ‌తో అద్భుతమైన జెమ్ – కట్ డిజైన్ తో మిళితం చేసింది. అదనంగా, ఈ చిప్ ‌సెట్ అధునాతన స్మార్ట్ ‌ఫోన్ ఫీచర్లైన ఫింగర్ ప్రింట్ / ఫేస్ అన్‌లాక్ తో పాటు మెరుగైన భద్రత కోసం VoWiFi / VoLTE తోడ్పాటు అందిస్తుంది !

Infinix Smart 4 Plus ధర మరియు సేల్

జూలై 28 నుండి ఫ్లిప్‌ కార్ట్‌లో కేవలం 7999 / – ధరకు అందుబాటులో వుంటుంది మరియు ఈ స్మార్ట్ 4 ప్లస్ ఓషన్ వేవ్, వాయిలెట్ మరియు మిడ్‌ నైట్ బ్లాక్ అనే మూడు రంగులలో వస్తుంది.

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo